న్యూఢిల్లీ : దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగిన మనకీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా స్వదేశీ యాప్‌లనే వాడాలని కోరారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను సైతం మనమే తయారు చేసే స్థాయికి చేరాలని, ప్రపంచస్థాయి ప్రమాణాలను సాధించినప్పుడే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశం టాయ్ హబ్‌గామారాలని ఆయన ఆకాక్షించారు. బొమ్మల వ్యాపారం చాలా పెద్దదని, దేశ ప్రజలంతా దీనిపై ఆలోచించాలని సూచించారు. “మన దేశంలో చాలా ఆలోచనలు వుంటాయి. ఎన్నెన్నో భావనలు వుంటాయి. మన చరిత్ర సుసంపన్నమైనది. దాని ఆధారంగా మనం గేమ్స్ తయారు చేయాలి. దేశంలో యువమేధావులకు కొరత లేదు. వారిని ప్రోత్సహించాలి. గేమింగ్‌పై దృష్టి పెట్టి గొప్ప మార్కెట్‌ను సాధించాలి. అలాగే స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహించాలన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని కొనియాడారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని చెప్పారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని కోరారు. కరోనా కారణంగా ప్రజలు పండుగలను పెద్ద ఎత్తున జరుపుకోలేకపోతున్నారని, మరికొన్నాళ్లు ఓపిక పట్టాల్సిన అవసరం వుందని కోరారు.
స్వదేశీ ఉత్పత్తులనే వాడండి
RELATED ARTICLES