కోహ్లీ, బుమ్రాలకు రెండో స్థానం
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
దుబాయి: ఐసిసి మంగళవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ క్రమంలో ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాయింట్ల పరంగా అందనంత దూరంలో స్టీవ్ స్మిత్ నిలిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన స్టీవ్ స్మిత్… రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ఆస్ట్రేలియా జట్టు యాషెస్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్ విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో వీరిద్దరి జోరు కొనసాగింది.
937 పాయింట్లతో అగ్రస్థానంలో
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నా స్టీవ్ స్మిత్ 937 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. డిసెంబర్ 2017లో స్టీవ్ స్మిత్ ఆల్-టైమ్ బెస్ట్ అగ్రిగేట్‌కు గాను కేవలం 10 పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే, మొత్తంగా బ్యాట్స్‌మెన్ విభాగంలో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించేందుకు స్మిత్ 25 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. 1948లో ఆసీస్ లెజె్‌ండ సర్ డాన్ బ్రాడ్‌మన్ 961 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇదే రేటింగ్ పాయింట్ల పరంగా టెస్టుల్లో అత్యధికం. అంతేకాదు విరాట్ కోహ్లీకి కన్నా స్మిత్ 34 పాయింట్లతో ముందంజలో నిలిచాడు. ఆఖరి టెస్టులో స్టీవ్ స్మిత్ రాణిస్తే మరిన్ని రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. కాగా, యాషెస్ సిరిస్‌లో తన అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన ప్యాట్ కమిన్స్ 914 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ రాణిస్తే స్మిత్‌ను వెనక్కినట్టే అవకాశం ఉంది. ఇక, బ్యాటింగ్ ర్యాంకింగ్స్ జాబితాలో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, పుజారా నాలుగో స్థానంలో హెన్రీ నికోల్స్, జో రూట్, రహానే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మెక్‌గ్రాత్ రికార్డుని సమం..
ఈ క్రమంలో 2001లో ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డుని సమం చేశాడు. యాషెస్ సిరీస్‌లో కమిన్స్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో తన రేటింగ్ పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు. 1914లో ఇంగ్లండ్ బౌలర్ సిడ్నీ బారన్స్ సాధించిన 932 రేటింగ్ పాయింట్లే ఇప్పటివరకూ టెస్టు ఫార్మాట్లో అత్యధికం. ఇక, రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ కన్నా కమిన్స్ 63 రేటింగ్ పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. కాగా, సెప్టెంబర్ 15 నుంచి దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సపారీలు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.
బుమ్రా రెండో స్థానంలో
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 835 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా… వెస్టిండిస్ పేసర్ జేసన్ హోల్డర్ 814 రేటింగ్ పాయింట్లతో నాలుగో ర్యాంకులో నిలిచాడు. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించడంతో ఆప్ఘన్ క్రికెటర్లు తమ ర్యాంకులను మరింతగా మెరుగుపరచుకున్నారు. ఈ టెస్టులో (92, 50) పరుగులతో ఫరవాలేదనిపించిన మాజీ కెప్టెన్ అస్ఘర్ ఆప్ఘన్ 110వ ర్యాంకు నుంచి 63వ ర్యాంకుకు ఎగబాకాడు. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రెహ్మాత్ షా 93వ ర్యాంకు నుంచి 65వ ర్యాంకుకి చేరుకున్నాడు. ఇక, ఆప్ఘన్ విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ రషీద్ ఖాన్ 69వ ర్యాంకు నుంచి 37వ ర్యాంకుకి ఎకబాకాడు.
స్మిత్ టాప్
RELATED ARTICLES