HomeNewsBreaking Newsస్థిరంగాఅల్పపీడనం

స్థిరంగాఅల్పపీడనం

నేడు అత్యంత భారీ వర్షాలు
గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు
వాతావరణ కేంద్రం హెచ్చరిక
జలదిగ్బంధనంలోనే వరంగల్‌
భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్‌
వాయువ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తీవ్ర అల్ప పీడనానికి అనుబంధంగా ఆవర్తనం కూడా ఏర్పడింది. దీని కారణంగా బుధవారం, గురువారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశ ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాష్ర్టంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఖమ్మం, నల్లగొండ,
సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. నిర్మల్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కుంభవష్టి వానలు కురిశాయి. మరో మూడు జిల్లాల్లో అత్యంత భారీ, ఐదు జిల్లాలో అతి భారీ, 10 జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించి పోయింది. అనేక చెరువులు, కుంటలు రాత్రికి రాత్రే నిండిపోయాయి.
వేల్పూర్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదు..
గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలోని నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హనుమకొండ, జనగామ, వరంగల్‌లో కొన్ని చోట్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసినట్టు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా వెల్పూర్‌లో అత్యధికంగా 40 సెంటీమీటర్లు, జక్రాన్‌పల్లి, భీంగల్‌ 23, వరంగల్‌ జిల్లా సంగెం 22, నెల్లబల్లిలో 17, హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ 17, జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ 16, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ 14, సాయంపేట, పరకాల, మోర్తాడ్‌, ఆర్మూర్‌లో 14, వరంగల్‌ జిల్లా పర్వతగిరి, ములుగులో 13, బోనకల్‌, పాలకుర్తి, డోర్నకల్‌లో 12, చెన్నారావుపేట, శ్రీరాంపూర్‌, కూసుమంచి, మహబూబాబాద్లో 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments