హైదరాబాద్ : టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ స్ట్రైకర్స్ సహా యజమానికిగా సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ వ్యవహరించనుంది. టిపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ స్ట్రైకర్స్‌లో వాటాను కొనుగోలు చేయడం ద్వారా రకుల్‌ప్రీత్ సింగ్ క్రీడల్లోకి ప్రవేశించింది. మాజీ నేషనల్ ప్లేయర్ కునాల్ ఠక్కూర్, మృనాల్ జైన్‌ల చొరవతో టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ప్రస్తుతం రెండో సీజన్‌ను జరుపుకుంటుంది. గత సీజన్‌ను టోర్నీ నిర్వహాకులు బాలీవు్‌డ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ చేత ప్రారంభించారు. కాగా, ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ హోటల్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ జెర్సీని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘ఎఐటిఎ, ఎంఎస్‌ఎల్‌టిఎ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్‌లో భాగం కావడానికి నేను సంతోషిస్తున్నాను‘ అని తెలిపారు. ‘ఈ వేదిక ద్వారా దేశంలోని యువ యు-14 బాలురు, యు-18 బాలికలను ప్రోత్సహించే ఏకైక లీగ్ ఇది. ఇది టెన్నిస్‌ను ప్రోత్సహించడానికి ఒక గొప్ప చొరవ. ఈ టోర్నీలో ఆడేటటువంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లందరినీ చూసేందుకు గాను డిసెంబర్ వరకు వేచి ఉండలేకపోతున్నా‘ అని రకుల్ అన్నారు. ‘నేను ఆర్మీ కుటుంబ నేపథ్యం నుండి వచ్చాను, జీవితంలో క్రీడల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాను. నేను సంతోషంగా ఉన్నాను… టెన్నిస్ గొప్ప క్రీడ‘ అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు. మీరు ఢిల్లీకి చెందినవారైనప్పటికీ, హైదరాబాద్ ఫ్రాంఛైజీ కోసం ఎందుకు బి్‌డ వేశారన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. ‘నా కెరీర్‌ను ఇక్కడే ప్రారంభానని… హైదరాబాద్ నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే జట్టులో భాగస్వామినయ్యా. భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు శిక్షణ ఇచ్చిన కోచ్ మిస్టర్ నరేంద్రనాథ్ నేతృత్వంలో హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ చేస్తోంది‘ అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడైనా టెన్నిస్ ఆడారా? అని అడిగిన ప్రశ్నకు ‘అవును, నా చిన్నతనంలో టెన్నిస్ ఆడాను. ఆ తర్వాత ఖాళీ సమయంలో నేను గోల్ఫ్‌ను ఆస్వాదించాను. ఆ తర్వాత జాతీయ స్థాయి గోల్ఫ్ పోటీల్లో పాల్గొన్నాను. అయితే, సినీ కెరీర్ కారణంగా ఆ తర్వాత కొనసాగించలేకపోయాను‘ అని రకుల్ తెలిపారు. ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టు మెంటార్ నరేంద్రనాథ్, యజమాని గౌరవ్, లీగ్ సహ యజమాని కృనాల్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. టెన్నిస్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) రెండో సీజన్ డిసెంబర్ 12 నుంచి 15 వరకు ముంబైలో జరుగనుంది. ఇక, రకుల్ విషయానికి వస్తే మార్జవాన్, డి డి ప్యార్ దే వంటి విజయాల దక్కించుకుంది.
స్ట్రైకర్స్ సహా యజమానిగా రకుల్
RELATED ARTICLES