సెంచూర్యన్: పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డెల్ స్టెయిన్ కొత్త రికార్డు సృష్టించాడు. సఫారీ జట్టు తరఫును (422) అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా స్టెయిన్ రికార్డుల్లో నిలిచాడు. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ వికెట్‌ను తీసిన స్టెయిన్ తన ఖా తాలో గొప్ప రికార్డును వేసుకున్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా స్టార్ షాన్ పొలక్ (421) పేరుతో ఉన్న రికార్డును తాజాగా 10 ఏళ్ల తర్వాత స్టెయిన్ అధిగమించాడు. కాగా, బుధవారం పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో సఫారీ బౌలర్ల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు (47 ఓవర్లలో) 181 పరుగులకు కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లో బాబార్ ఆజమ్ (71; 79 బంతుల్లో 15 ఫోర్లు) అ ద్భుతమైన బ్యాటింగ్‌తో ఒంటరి పోరాటం చేశాడు. మరోవైపు అజర్ అలీ (36), హసన్ అలీ (21 నాటౌట్) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌ లర్లలో డౌనె ఒలివర్ (37/6) హడలెత్తించాడు. ఇతర బౌలర్లలో రబడా మూడు, స్టెయిన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం మొదటి ఇ న్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు 36 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సఫారీ బ్యాట్స్‌మన్లలో ఎల్గర్ (22), డి బ్రూ న్ (29), తెంబ బవుమా (38 బ్యాటింగ్) రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్, షాహిన్ అఫ్రిదీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.