ముంబయి: స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఈ సోమవారం మదుపరుల పాలిట ‘బ్లాక్ మండే’గా నిలిచింది. నోవెల్ కరోనావైరస్(కొవిడ్ వ్యాప్తి, క్రూడాయిల్ భారీగా పతనంకావడం, ప్రపంచ ఆర్థికమాంద్యం భయాలు మార్కెట్‌ను అల్లకల్లోలం చేశాయి. ఎన్నడూ లేనంతగా ఇంట్రాడేలో స్టాక్ మార్కెట్ సూచీలు రెండూ భారీగా పతనమయ్యాయి. క్లోజింగ్ బెల్ సమయానికి 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 1,941.67 పాయిం ట్లు లేక 5.17 శాతం మేరకు పతనమై 35, 634.95 వద్ద, 50 షేర్ల సూచీ నిఫ్టీ 538 పా యింట్లు లేక 4.90 శాతం పతనమై 10,451.45 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్‌లో ఈ భారీ పతనం మదుపరుల రూ. 6,84,277.65 కోట్ల సంపదను తుడిచిపెట్టింది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజిలో లిస్టయిన సంస్థల మార్కెట్ మూల ధనాన్ని రూ. 1,37,46,946.76 కోట్లకు తగ్గించేసింది. సెన్సెక్స్ ఛార్ట్‌లో 16 శాతం నష్టపోయి ఒఎన్‌జిసి టాప్ లూజర్‌గా నిలిచింది. దాని తర్వాత రిలయ న్స్ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, టిసిఎస్, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఆటో కంపెనీ షేర్లు నష్టపోయాయి. బ్లూచిప్ కం పెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే 12 శాతం నష్టపోయింది. బడా బ్యాంకు ఎస్‌బిఐ, యెస్ బ్యాంక్ లో రూ. 2.450 కోట్ల విలువగల 49 శాతం వాటాలు తీసుకుంటానని ప్రకటించినందున 6 శాతం నష్టపోయింది. కాగా సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌బ్యాంక్ షేరు ధర ఇంట్రాడే ట్రేడింగ్‌లో 31 శాతం మేరకు పెరిగింది. అన్ని రంగాల షేర్లు దాదాపు నష్టాల్లోనే ముగిశాయి. విద్యుత్ రంగం సూచీ 9.74 శాతం నష్టపోయిం ది. దాని తర్వాత లోహం, ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్, బ్యాకెక్స్, ఆర్థిక సూచీలు నష్టాలు మూటకట్టుకున్నాయి. ప్రపంచ ఆర్థికమాంద్యం భయాలు మార్కెట్‌లో మదుపరులను కుదిపేశాయి. శాతంవారీగా చూసినప్పుడు మార్కెట్ రెండు సూచీలు ఒక్క రోజులోనే భారీగా పతనమవ్వడం అన్నది… దాదాపు ఐదేళ్లలో ఇదే పెద్దదని చెప్పొచ్చని అషికా స్టాక్ బ్రోకింగ్ ఈక్విటీ రిసెర్చ్ అధ్యక్షుడు పరాస్ బోథ్రా చెప్పారు. కరోనావైరస్ కేసులు పెరుగుతుండడం, ప్రపంచంలో చమురు ధరలు పతనం కావడం, ప్రపంచంలో ఆర్థికమాంద్యం భయాలు పెరుగుతుండడంతో అంతా అమ్మకాలకే పాల్పడ్డారు. ప్రపంచంలో షాంఘై, హాంకాంగ్, సి యోల్, టోక్యో స్టాక్‌మార్కెట్లు 5 శాతం మేరకు నష్టాలను చవిచూశాయి. యూరొపియన్ సూచీలు కూడా 6 శాతం మేరకు పతనమయ్యాయి. కరెన్సీ విషయానికి వస్తే అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 27 పైసలు పతనమై రూ. 74.14 వద్ద ట్రేడయింది. ‘ఒపెక్, రష్యా మధ్య సాపత్యం బెడిసికొట్టడంతో దాదాపు 30 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా 30 శాతం మేరకు క్రూడాయిల్ ధరలు పడిపోయాయి’ అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రిటైల్ రిసెర్చ్ అధిపతి దీపక్ జసని తెలిపారు.
స్టాక్ మార్కెట్‌లో అల్లకల్లోలం
RELATED ARTICLES