విజృంభించిన ఒలివర్
పాక్ రెండో ఇన్నింగ్స్ 190 ఆలౌట్, మొదటి టెస్టు
సెంచూర్యన్: పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికావిజయానికి చెరువైంది. బౌలర్ల జోరు కొనసాగుతున్న ఈ టెస్టులో పాకిస్థాన్ సఫారీల ముందు 149 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. సఫారీ బౌలర్ ఒలివర్ (5/59) ధాటికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు పాక్ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఒలివర్ 6 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఒలివర్ మొత్తం 11 వికెట్లు పడగొట్టి పాక్‌ను ఓటమి అంచులో నిలబెట్టాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసి సల్ప ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్‌ను టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ శుభారంభాన్ని అందించినా తర్వాత సౌతాఫ్రికా బౌలర్ ఒలివర్ పెద్ద దెబ్బతీశాడు. తొలి వికెట్‌కు ఓపెనర్లు 44 పరుగులు జోడించిన అనంతరం ఫకర్ జమాన్ (12)ను ఒలివర్ ఔట్ చేశాడు. తర్వాత మరో ఓపెనర్ ఇమాముల్ హక్ (57; 96 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మసూద్ (65; 120 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. తర్వాత పుంజుకున్న ఒలివర్ పాక్‌ను చీల్చిచెండాడు. ఇతని ధాటికి పాక్ వరుసగా వికెట్లు కోల్పోతూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. మరో ఎండ్‌లో ఇతర బౌలర్లు కూడా పోటిపడి మరి వికెట్లు తీయడంతో పాక్ ధనాధన్ వికెట్లు కోల్పోయింది. ఒక సమయంలో వంద పరుగుల వద్ద ఒక వికెట్‌తో ఉన్న పాక్ తర్వాత 90 పరుగులలోపే మిగతా 9 వికెట్లు కోల్పోయింది. సఫారి బౌలర్ల ధాటికి పాక్ 56 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఒలివర్ ఐదు వికెట్లు పడగొట్టగా.. రబాడ మూడు, డెట్ స్టెయిన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
సౌతాఫ్రికా లక్ష్యం 149
RELATED ARTICLES