ప్రజాపక్షం/హైదరాబాద్ : జీహెచ్ యంసి పరిదిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ప్రదాన రహదారుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తుంది. ఇందులో భాగంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఈవిడియం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి సికింద్రాబాద్, ఎల్ బి నగర్ జోన్ లో పర్యటించారు. క్షేత్ర స్థాయి లో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. సికింద్రాబాద్,lb నగర్ జోన్ లోని సికింద్రాబాద్, తార్నాక,మౌలాలి నేరేడ్ మెట్, యాప్రాల్, సైనిక్ పురి, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో పర్యటించి పారిశుధ్య పనులు, హై ప్రెజర్ జెట్టింగ్ మిషన్ లతో సోడియం హైపో క్లోరైట్ పిచికారిని పరిశీలించారు. మార్కెట్లు, దుఖాణాల్లో కూర్గాయలు, నిత్యవసర వస్తువులను కొనేటప్పుడు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని మేయర్ విజ్ఞప్తి చేసారు. అదికారులు, కార్పోరేటర్లు ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలని వారికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కప్ర డీసీ శైలజ, కార్పొరేటర్లు అలకుంట్ల సరస్వతి, గోళ్ళూరి అంజయ్య,శ్రీదేవి, స్వర్ణరజ్ లు పాల్గొన్నారు.
నేడు ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం గ్రీవెన్స్ లేదు
ఈ నెల 29 న ఆదివారం ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం గ్రీవెన్స్ ను నిర్వహించడంలేదని జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.