చాడ రాసిన ‘రేకొండ సామాజిక చైతన్యం-గ్రామీణ స్థితిగతులు’ పుస్తకావిష్కరణలో మంత్రి ఈటల
ప్రజాపక్షం/ చిగురుమామిడి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పుట్టిన చాడ వెంకటరెడ్డికి తన సొంతగడ్డపై ఉన్న ప్రేమే ‘రేకొండ సామాజిక చైతన్యం స్థితి గతులు’ అనే పుస్తక రచనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రేకొండ గ్రామంలోని జెడ్‌పి హైస్కూల్ ఆవరణంలో మాజీ ఎంఎల్‌ఎ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట స్వీయ రచనలో వెలువడిన ‘రేకొండ సామాజిక చైతన్యం స్థితి గతులు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం స్థానిక సర్పంచ్ రజిత అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి ఈటల రాజేందర్ పుస్తకంతో పాటు రేకొండపై చాడ వెంకట్‌రెడ్డి రాసి, వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాటల సిడిని జెడ్‌పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ శశాంక, చాడ వెంకటడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే, ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అనడానికి ఏ మా త్రం సందేహం లేకుండా చాడ వెంకట్‌రెడ్డి రాసిన పుస్తకం చదువుతే తెలుస్తుందని, 70 సంవత్సరాల వయసులో కూడా తాను పుట్టిన ఊరుపై మమకారం పోలేదనడానికి నిదర్శనం ఆయన పుస్తకమేనన్నారు. అందులో 50,60 సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్న స్థితి గతులు, ప్రజల జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, ఆప్యాయత, అనురాగాలు, ఆర్థిక, సామాజిక అంశాలను క్లుప్తంగా రా యం చాడకే చెల్లిందని, రేకొండ గ్రామం చైతన్య వంతమైన గ్రామమని, చుట్టుప్రక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉందని, రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ గ్రామంలోపాలకవర్గాలు అభివృద్ధి పనుల విషయంలో అందరూ కలిసి పనిచేయాలని, గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేస్తుందని ఈటల రాజేందర్ తెలిపారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఊరుపై, అక్కడి పరిస్థితులపై చాడ వెంకట్‌రెడ్డి పుస్తకమని కొనియాడారు. గ్రామీణ వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు అధికంగా ఉంటాయని, అలాంటి ప్రాంతంపై పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకురావడం సంతోషకరమని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని శశాంక పేర్కొన్నారు. పుస్తక రచయిత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రేకొండ గ్రామంలో పుట్టిన తాను గ్రామ సర్పంచ్‌గా, ఎంపిపిగా, జెడ్‌పిటిసిగా, ఎంఎల్‌ఎగా గెలిపించిన ఊరు ప్రజల రుణం తీర్చుకోలేనిదని, అలాంటి గ్రామంపై లాక్‌డౌన్ సమయంలో పుస్తకం రాయాలనే ఆలోచన రావడం, దాన్ని అమలు చేయడం జరిగిందని, ఈ పుస్తకం వెలువడడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడపి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపిపి కొత్త వినీత, జెడ్‌పిటిసి గీకురు రవీందర్, సర్పంచ్ పిట్టల రజిత, ఎంటిసిలు కొతురి సంధ్య, చాడ శోభ తదితరులు పాల్గొన్నారు
సొంతగడ్డపై ప్రేమే.. పుస్తక రచనకు ఊపిరి
RELATED ARTICLES