బెంగళూరులో ప్రస్తుతం జరుగుతున్న ‘సైమా’ వేడుకల్లో పుష్ప సినిమా మొత్తానికి రికార్డుల ప్రభంజనం సృష్టించింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ తో పాటు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా, అలాగే బెస్ట్ సపోర్టింగ్ రోల్ కి, అదే విధంగా బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ తెలుగు మూవీ క్యాటగిరీలో మొత్తం ఆరు అవార్డులను దక్కించుకుంది. ఇక బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ రెండోసారి అవార్డు అందుకుని తగ్గేదెలా అంటూ ఓ ఫోజిచ్చి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పుష్ప 2 కోసం పాన్ ఇండియా వైడ్‌గా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ను ముస్తాబు చేస్తున్నాడు సుకుమార్
‘సైమా’ అవార్డ్‌లో ‘పుష్ప’ ప్రభంజనం..!
RELATED ARTICLES