రెండో రౌండ్లో కశ్యప్, మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బిడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నమెంట్‌లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్‌లు శుభారంభం చేశారు. నూతన ఏడాదిలో ప్రారంభమైన తొలి ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీలో భా రత షట్లరు సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లో కూడా సత్తా చాటారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొనప్ప జోడీ రెండో రౌండ్‌లో దూ సుకెళ్లింది. బుధవారం ఇక్కడ జరిగి పురుషు ల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడో సీడ్ కి దాంబి శ్రీకాంత్ (భారత్) 21 21 11 తేడాతో హాంగ్ కాంగ్‌కు చెందిన ఎన్‌జి క లాంగ్ అంగుస్‌ను వరుస గేమ్‌లలో చిత్తు చేసి రెండో రౌండ్లో ప్రవేశించాడు. ఆరంభుం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దూ కుడేన షాట్లను ఆడుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. మొదట్లో గట్టి పోటీనిచ్చిన హాం గ్ కాంగ్ ఆటగాడు తర్వాత శ్రీకాంత్ జో రుకు తగ్గాడు. ఈ తొలి గేమ్‌ను శ్రీకాంత్ 21 గెలుచుకున్నాడు. తర్వాత గేమ్ లో మరింతగా దూకుడును కనబర్చిన శ్రీ కాంత్ వరుసగా పాయింట్లు సాధిస్తూ పో యాడు. ఇతని ధాటికి ప్రత్యర్థి నిస్సహాయుడైపోయాడు. చివరికి శ్రీకాంత్ 21 రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొ ంతం చేసుకున్నాడు. కిదాంబి రెండో రౌం డ్‌లో హాంగ్‌కాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కి విన్‌సెంట్‌తో తలపడనున్నాడు. మరో పరుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పారుపల్లి క శ్యప్ 19- 21- 21 రస్‌ముస్ జెమ్కే (డెన్మార్క్)పై చెమటోడ్చీ నెగ్గా డు. తొలి గేమ్‌ను రెండు పాయింట్లతో కో ల్పోయిన కశ్యప్ తర్వాతి గేమ్‌లో పుంజుకున్నాడు. ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. ఇద్దరూ కూడా దూకుడుగా ఆడడంతో ఈ గేమ్ హోరాహోరీగా సాగింది. నువ్వానేనా అన్నట్టు జరిగిన రెండో గేమ్‌లో చివరికి కశ్యప్ 21 దక్కించుకున్నాడు. త ర్వాత కీలకమైన నిర్ణయాత్మకమైన చివరి గేమ్‌లో మాత్రం కశ్యప్ అద్భుతంగా పోరాడాడు. ఆరంభం నుంచే జోరు ను కొనసాగిస్తూ 21 గేమ్ తో పాటు మ్యాచ్‌నూ గెలిచి రెం డో రౌండ్‌లో అడుగుపెట్టాడు.
టాప్ సీడ్‌కు షాక్..
ఇక పురుషుల సింగిల్స్ టాప్ సీడ్ జపాన్ స్టార్ కెంటో మొమోటాకు తొ లి రౌండ్‌లోనే షాక్ తగిలింది. ఇక్కడ జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో కెంటా నిషిమోటో (జపా న్) 21- 14 22 20తో కెంటో మొమోటా (జాపాన్)ను ఓ డించి రెండో రౌండ్లో ప్రవేశించాడు.
సైనా అలవొకగా..
మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ అలవొకగా రెండో రౌండ్‌లో దూసుకెళ్లింది. ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా నెహల్ (భారత్) 14 21 21 తేడాతో హాంగ్‌కాంగ్ క్రీడాకారిణి డెంగ్ జోయ్ జువాన్‌పై చెమటోడ్చి నెగ్గింది. తొలి గేమ్‌లో ఘర ఓటమిని చవిచూసిన సైనా తర్వాతి గేమ్‌లలో పుంజుకుని గొప్ప విజయాన్ని నమోదు చేసింది. హోరాహోరీ గా జరిగిన రెండో గేమ్‌లో సైనా చివర్లో దూ కుడును పెంచి 21 గేమ్‌ను సొంతం చేసుకుంది. తర్వాత నిర్ణయాత్మకమైన ఆఖ రి గేమ్‌లో కూడా సైనా చివరి వరకు పోరాడింది. చివర్లో ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఆడిన సైనా చివరి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకొని రెండో రౌండ్లో అడుగుపెట్టింది. ఇక మహిళల డబుల్స్‌లో అశ్విని పొనప్ప, సిక్కి రెడ్డిల భారత జోడీ వరుస గేమ్‌లలో వి జయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్‌లో అశ్విని పొనప్ప, సిక్కిరెడ్డి (భారత్) జంట 21- 22 ఎన్‌జి టి సిజ్ యో, యోన్ సిన్ యింగ్ (హాంగ్‌కాం గ్) ద్వయంపై విజయం సాధించింది. మొ దటి గేమ్‌ను ఈజీగా గెలుచుకున అశ్విని జోడీకి రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. కానీ చివర్లో సమయోచితంగా ఆడిన భారత జట్టు గొప్ప విజయాన్ని దక్కించుకుంది.
ప్రణవ్‌చోప్రా జోడీ ఔట్..
మిక్స్‌డ్ డబుల్స్‌లో భారతకు షాక్ తగిలిం ది. ఇక్కడ జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యా చ్‌లో ప్రణవ్ జెర్రి చోప్రా, సిక్కి రెడ్డి జోడీ 19 17 రాబిన్ టాబెలింగ్, స లెనాపీక్ (నెదర్లాండ్స్) జోడి చేతిలో ఓటమి తో తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది.
సైనా, శ్రీకాంత్ శుభారంభం
RELATED ARTICLES