సెమీస్‌లో కారొలినా గెలుపు, మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సీజన్ తొలి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న సైనాకు స్పెయిన్ స్టార్ కారొలినా మారిన్ షాకిచ్చింది. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుచుకున్న మారిన్ వరుస గేమ్‌లలో సైనాను చిత్తు చేసి మాలేషియా మాస్టర్స్ ఫైనల్లో దూసుకెళ్లింది. 2017లో మాలేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా ఈసారి కూడా టైటిల్ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ మారిన్ సైనా ఆశలపై నీరుగార్చింది. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్ (భారత్) 16 13 తేడాతో నాలుగో సీడ్ కారొలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ను మారిన్ 40 నిమిషాల్లోనే ముగించేసింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన సైనా తర్వాత ప్రత్యర్థి దూకుడుముందు తలొగ్గింది. మారిన్ సర్వీస్‌లను తట్టుకోలేక పోయింది. తొలి గేమ్ హోరాహోరీగా ప్రారంభమైనా చివర్లో సైనా తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేక పోయింది. మరోవైపు మారిన్ మాత్రం అద్భుతంగా ఆడుతూ సైనాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో తొలి గేమ్ సైనా 16- కోల్పోయింది. తర్వాతి గేమ్‌లోనూ మారిన్ జోరు కొనసాగించింది. సైనాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూకుడును ప్రదర్శించింది. ఈ గేమ్‌లో కూడా పట్టు సాధించిన మారిన్ 21 గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. సైనా ఓటమితో మాలేషియా మాస్టర్స్ ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. శనివారం ఇక్కడ జరిగిన మహిళల మరో సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆరో సీడ్ రచనోక్ ఇంటనోన్ 21 21 గొ జిన్ వెయ్ (మలేషియా)ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. కారొలినా మారిన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయింది.
సైనా పోరాటం ముగిసింది
RELATED ARTICLES