చైనా ఓపెన్ బ్యాడ్మింటన్
పుజౌ: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో చైనా క్రీడాకారిణి కై యాన్ చేతిలో వరుస గేమ్‌లలో ఓడిపోయింది. కేవలం 24 నిమిషాలే సాగిన మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ సైనా.. కై యాన్‌కు ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్‌లోనే 9-21తో తేలిపోయిన సైనా.. రెండో గేమ్‌లో 12-21తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు స్టార్ ఆటగాడు, సైనా భర్త పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారుడు సిత్తికోమ్ పై 21-14, 21-3తో వరుస గేమ్‌లలో విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్ తో తలపడనున్నాడు. మరోవైపు మిక్స్ ్‌డ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా, సిక్కిరెడ్డీ జోడీ ఓటమిపాలైంది.
సైనా ఇంటికి.. కశ్యాప్ ముందుకు
RELATED ARTICLES