చెలరేగిన షెఫాలీ.. రాణించిన పూనమ్ యాదవ్
న్యూజిలాండ్‌పై నాలుగు పరుగుల తేడాతో హర్మన్‌సేన విజయం
ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్
మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 4 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ స్టేజ్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో ఆడిన భారత మహిళల జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. మెల్‌బోర్న్ వేదికగా న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(11; 8బంతుల్లో 2 పోర్లు) జట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఔటైంది. మరో ఓపెనర్.. షఫాలీ వర్మ (46; 34 బంతుల్లో 4పోర్లు, 3సిక్సర్లు) వన్ డౌన్ బ్యాట్ ఉమెన్ బాటియా(23; 25 బంతుల్లో 3పోర్లు) ధాటిగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు రెండో వికెట్ 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరు ఔటైన తరువాత టీమిండియా మిడిల్ ఆర్డర్ తడబడింది. ఓ దశలో 80/3 తో పటిష్టంగా ఉన్న భారత్.. 111/7తో నిలిచింది. అయితే.. ఆఖర్లో శిఖాపాండే(10; 14బంతుల్లో), రాధా యాదవ్(14; 9బంతుల్లో 1సిక్సర్) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.
ఆరంభంలోనే షాక్:
134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కివీస్ ఓపెనర్లను కోలుకోనివ్వలేదు. 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రేచల్ ప్రైస్ట్ (12)ను శిఖ పాండే పెవియన్ చేర్చింది. అనంతరం కెప్టెన్ సోఫి డివైన్ (14), సుజీ బేట్స్ (6) వికెట్లను చేజార్చుకుంది. దీంతో మూడు కీలక వికెట్లు కోల్పోయిన కివీస్ కష్టాలో పడింది. మ్యాడీ గ్రీన్ (24), క్యాటీ మార్టిన్ (25) నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. దీంతో కివీస్ రేసులోకి వచ్చింది. ఈ సమయంలో రెండు జట్ల విజయావకాశాలు సమానంగా మారాయి. ఇదే సమయంలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మళ్లీ సమీకరణాలు మారిపోయాయి. శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్ కివీస్ బ్యాటర్లను కట్టడి చేసారు. మ్యాడీ, క్యాటీ పెవిలిన్ చేరడంతో కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
అమెలియా కెర్ పోరాటం:
90 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన జట్టుకు అమెలియా కెర్ అండగా నిలిచింది. జట్టుకు విజయాన్ని అందించేందుకు ప్రయత్నించింది. 19 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో పూనమ్ యాదవ్ వేసిన 19వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, రెండు పరుగులతో 18 పరుగులు చేసి జట్టును దాదాపు విజయానికి చేరువ చేసింది. కానీ.. చివరి ఓవర్‌లో మాత్రం జట్టుకు విజయాన్ని అందించలేక పోయింది. చివరి బంతికి ఔట్ అయి నిరాశపరిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. స్మృతి మందాన (11), హార్మన్‌ప్రీత్ కౌర్(1) విఫలమైనా.. యువ సంచలనం షెఫాలీ వర్మ 46 పరుగులతో రాణించింది. తానియా భాటియా (23) విలువైన పరుగులు చేసింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ షెఫాలీవర్మ ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు చేరుకుంది.
సెమీస్‌లో భారత్
RELATED ARTICLES