క్విటొవా, కొలిన్,స్టెఫనొస్ కూడా.. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్
మెల్‌బోర్న్: స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లో ప్రవేశించాడు. మరోవైపు ఎనిమిదో సడ్ పెట్రా క్విటొవా, డానియల్ కొలిన్స్, ప్రీక్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించిన యువ సంచలనం గ్రీకు వీరుడు స్టెఫనొస్ ట్సిసిపాస్‌లు సెమీస్‌లో దూసుకెళ్లారు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్ ఇతర మ్యాచుల్లో నిషికొరితో టాప్ సీడ్ జొకోవిచ్, ప్లిస్కొవాతో సెరెనా విలియమ్స్ స్వీటొలినాతో ఒసాకా, పౌలేతో రౌనిక్‌లు తలపడనున్నారు. మంగవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ స్టార్ రెండో సీడ్ రాఫెల్ నాదల్ 6 6 6 తేడాతో అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టియాఫెను వరుస సెట్లలో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టాడు. మ్యాచ్ తొలి సెట్ నుంచే దూకుడుగా ఆడిన నాదల్ వరుస దాడులతో ప్రత్యర్థిపై విరుచకుపడ్డాడు. ఇతని ధాటికి అమెరికా ఆటగాడు హడలిపోయాడు. చివరి వరకు దూకుడుగా ఆడిన నాదల్ తొలి సెట్‌ను 6 సొంతం చేసుకున్నాడు. తర్వాత సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ చివర్లో ఆధిక్యంలో దూసుకెళ్లిన నాదల్ ఈ సెట్‌ను కూడా ఈజీగాగెలుచుకున్నాడు. ఇక ఆఖరిదైన మూడో సెట్‌లో మరింతగా చెలరేగి ఆడిన నాదల్ 6 తేడాతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన నాదల్ టైటిల్‌కు మరో రెండు అడుగుల దూరంలో నిలిచాడు. పురుషుల మరో సింగిల్స్ క్వార్టర్స్‌లో గ్రీస్‌కు చెందిన 20 ఏళ్ల యువ సంచలనం స్టెఫనొస్ ట్సిసిపాస్ 7 4 6 7 రొబర్టొ బౌటిస్ట అగాట్ (స్పెయిన్)పై విజయం సాధించి సెమీస్‌లో దూసుకెళ్లాడు. ప్రీ క్వార్టర్స్‌లో స్విస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్‌ను ఓడించిన స్టెఫనొస్ ఈ సారి కూడా అదే జోరును కొనసాగిస్తూ అగాట్‌పై ఘన విజయం సాధించాడు.
క్విటొవా సునాయాసంగా..
మమిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటొవా 6 6 15వ సీడ్ అష్లే బార్టి (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో చిత్త చేసి సెమీ ఫైనల్లో ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్‌లో రష్యా స్టార్ మారియ షరపోవాను ఓడించిన ఆస్ట్రేలియా సంచలనం క్వార్టర్స్ బెర్త్ దాటలేక పోయింది. మహిళల మరో మ్యాచ్‌లో అమెరికా నయా స్టార్ కొలిన్స్ 2- 7 6 అనస్టాసియా పావ్లియుచెంకొవా (రష్యా)పై విజయం సాధించి సెమీస్‌లో దూసుకెళ్లింది.
ముగిసిన పేస్ పోరాటం..
భారత స్టార్ వేటరన్ ఆటగాడు లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్), సమంత స్టొసర్ (ఆస్ట్రేలియా) జోడీ 6 4 (8 తేడాతో ఐదో సీడ్ అన్నలీనా గ్రొన్‌ఫెల్డ్ (జర్మనీ), రాబర్ట్ ఫర్హ (కొలంబియా) జంట చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.
సెమీస్‌లో నాదల్
RELATED ARTICLES