HomeNewsLatest Newsసెబీ చీఫ్ మాధవి పురి బుచ్ రాజీనామా చేయాలి

సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ రాజీనామా చేయాలి

సమగ్ర దర్యాప్తుకు జెపిసి వేయాలని కాంగ్రెస్ డిమాండ్
22న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
ఢిల్లీలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం
న్యూఢిల్లీ : హిండెన్ ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో, సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదానీ సమస్యపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పేర్కొంది. ఈ అంశంపై ఆనెల 22న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఆ క్రమంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటితోపాటు సంస్థాగత విషయాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై పార్టీ శ్రేణులతో మల్లికార్జున ఖర్గే చర్చించారు. సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ఎఐసిసి రాష్ట్ర ఇన్ హాజరయ్యారు. సెబీ, అదానీ మధ్య అనుబంధం ఉన్నట్లు దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడడంతో దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఖర్గే అన్నారు. అలాగే స్టాక్ మార్కెట్లో చిన్న పెట్టుబడిదారుల నగదు ప్రమాదంలో పడకూడదని పేర్కొన్నారు. తక్షణే మోదీ ప్రభుత్వం సెబీ రాజీనామాను కోరాలని, దీనిపై జెపిసి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తగ్గుతున్న గృహ పొదుపు సమస్యలు దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్త ప్రచారంపై ప్రణాళిక రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని ఖర్గే సూచించారు. ఇక దేశంలోని రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కుల గణన అనేది దేశ ప్రజల డిమాండని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రైతులకు కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఆ దిశగా కొనసాగిస్తుందన్నారు. మన దేశంలోని యువతలో దేశభక్తి అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సైనిక దళాల్లో యువత పని చేసేందుకు
తీసుకు వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వాన్ని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే డిమాండ్ చేశారు. ఈ మోదీ పాలనలో దేశంలో రైలు పట్టాలు తప్పడం అనవాయితీగా మారిందని ఖర్గే ఎద్దేవా చేశారు. ఈ వరుస రైలు ప్రమాదాల వల్ల కోట్లాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, సమావేశం అనంతరం కెసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 60 మంది పార్టీ నేతలు హాజరై అదానీ స్కామ్ సంబంధించి తాజా పరిణామాలపై చర్చించినట్లు వెల్లడించారు. సెబీ బాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు. అదానీ వ్యవహారంపై జెపిసి వేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని ఈడీ కార్యాలయాలను ముట్టడిస్తాం అని ఆయన అన్నారు. ఈనెల 10వ తేదీ అమెరికా షార్ట్ సంస్థ హిండెన్ రీసెర్చ్.. సెబీ చైర్ మాధబి పురి బచ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ తాజాగా ఆరోపించింది. అయితే హిండెన్ బర్గ్ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని సెబీ బచ్ అన్నారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని వెల్లడించారు. హిండెన్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిగినట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. సెబీ ఛైర్ ఆమె భర్తతో తమకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని ప్రకటించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments