సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్
ప్రశ్నించే నోళ్లు నొక్కే ప్రయత్నం: సిపిఎం ధ్వజం
న్యూఢిల్లీ: ముంబయిలో శనివారం అరెస్టు చేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త తిస్తా సెతల్వాద్‌ను తక్షణమే విడుదల చేయాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. 2002 గోద్రా ఘటన తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేసిన పిటిషనర్లలో సెతల్వాద్ ఒకరు. ఆ కేసులో సిట్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించిన మరుసటి రోజే గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ (ఎటిఎస్) సెతల్వాద్‌ను ముంబయిలో అరెస్టు చేయడం గమానర్హం. సెతల్వాద్ నిర్వహిస్తున్న ఎన్‌జిఒలు, సేవా కార్యక్రమాల పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే ఆమెను నిర్బంధంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజా వ్యాఖ్యానించారు. ఈ అరెస్టుపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని, అదే విధంగా మానవ హక్కు ల కోసం శ్రమిస్తున్న వారిని వేధించే చర్యలను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశా రు. సెతల్వాద్ అరెస్టును ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నంగా సిపిఐ అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం చర్య ల కారణంగా రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోయే ప్రమాదకర పరిస్థితులకు ఇది సూచనగా పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే సెతల్వాద్ అరెస్టు జరిగిందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. సిట్ నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించకూడదని, ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని సెతల్వాద్ అరెస్టు ఉదంతం నిరూపిస్తున్నదని సిపిఎం తెలిపింది. కోర్టులకు, చట్టాలకు అతీతంగా సిట్ వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. మత వైషమ్యాలను రెచ్చగొట్టే అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని సిట్ విస్మరించిందని విమర్శించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటి పాలకులు నీరో చక్రవర్తులుగా వ్యవహరిస్తున్నారంటూ 2004లో వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు, మోడీకి క్లీన్ చిట్ అంశంపై ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని సిపిఎం వ్యాఖ్యానించింది. న్యాయం కోసం పోరాడేవారంతా విచారణలను ఎదుర్కోవాల్సిన దుస్థితి దాపురించిందని సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య విమర్శించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే 2002 గుజరాత్ అల్లర్లు జరిగాయని అన్నారు. అయితే, ఆ విషయాన్ని కోర్టు పట్టించుకోలేదని ఆరోపించార.
సెతల్వాద్‌ను తక్షణమే విడుదల చేయాలి
RELATED ARTICLES