టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్
ప్రజాపక్షం/హైదరాబాద్ : చాలా వేగంగా ని ర్మాణం జరగాల్సి న భవనాలకు ని ధులు నిలిపివేసి ఉపయోగించడానికి అనువుగా ఉ న్న సెక్రటేరియట్ భవనాలను కూల్చి కొత్తవి కట్టడం అవసరమా? అని టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. అందంగా ఉన్న అసెంబ్లీని కూల్చి ఇంకో భవనం ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. నిధుల దుర్వినియోగం ఆగాల ని, ఉన్న నిధులను స్కూళ్లకు ,ఆసుపత్రులకు వాడాలన్నారు. ఎపి ప్రభుత్వం తమకు కేటాయించిన భవనాల మరమ్మతులకు రూ. 40 కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేసిందని విన్నామని, ఇంత మంచి భవనాలను కూల్చ డం అవసరమా? అని కోదండరామ్ అన్నా రు. 2015 నుండి ఖాళీగా ఉన్న మానవ హక్కుల కమిషన్ సభ్యులను నియమించడానికి ప్రభుత్వానికి సమయం లేదు కానీ సెక్రటేరియట్‌ను కూల్చడానికి మాత్రం హడావుడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.