సూర్యాపేట జిల్లాలో 20 శాతం లోటు వర్షపాతం నమోదు
ప్రజాపక్షం/సూర్యాపేట : ఆలస్యంగానైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు దండిగా కురిసి చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తుండగా సూర్యాపేట జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇటీవల నిత్యం వర్షం కురుస్తున్నా ఎక్కడ కూడా చెరువులు, కుంటలు నిండిన దాఖలాలు లేవు. కోప్పోల్లోతుల్లో కూడా నీళ్ళు చేరకపోవడంతో వెలవెలలాడుతున్నాయి. ఈ సీజన్‌లో జూన్ నుండి నేటి వరకు అధికారుల చెబుతున్న లెక్కల ప్రకారం 607.08 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావల్సి ఉండగా, 483.6 మిల్లీమీటర్ల నమోదై సగటున -20శాతం లోటు వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లానే అత్యధిక లోటు వర్షపాతం నమోదైన జిల్లాగా రాష్ట్రంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 23 మండలాల పరిధిలోని ఆవాస గ్రామాలతోపాటు కలుపుకొని దాదాపు 1500 మేర చెరువులు, కుం టలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మిషన్ భగీరథ ద్వారా చేపట్టి నాలుగు విడతల్లో 902చెరువులను పునరు ద్ధరించింది. వర్షాలు సమృద్ధిగా పడితే చెరువులు నిండి రైతుల సాగు ఇబ్బ ందులు తొలుగుతాయని భావించింది. గత సంవత్సరంలో వర్షాలు కాస్త మెరుగ్గా పడినా ఈ ఏడాది మాత్రం అంతంత మాత్రమే పడ్డాయి. జూన్, జులై నెలల్లో ముఖం చాటేసిన వర్ణుడు ఆగష్టు, సెప్టెంబర్ మాసంలో కాస్త కరుణించడంతో వర్షాలు అడపదడపా పడుతున్నాయి.వర్షం కురవగానే ఆయా గ్రామాల్లోని వీధులు చెరువులను తలపిస్తున్నా గంట వ్యవధి లోనే భూమి మీద పడ్డ ప్రతి చినుకు భూమిలోకి ఇంకిపోతుంది.కురుస్తున్న వర్షా లను చూస్తే ప్రతి ఒక్కరూ భారీ వర్షం అని ఆనందం వ్యక్తం చేస్తున్నా చెరు వులు, కుంటల్లోకి నీరు చేరిన దాఖలాలు అతి స్వల్పమే.ఆయా చెరు వులను చూస్తే కోప్పోల్లోతు నీళ్ళే కనపడుతున్నాయి.లోటు వర్ష పాతంతో భూగ ర్భజలాలు కూడా అడుగంటిపోతున్నాయి. గత ఏడాది చూస్తే 8.53 మీట ర్ల లోతులో ఉన్న పాతాల గంగ మరింత పడిపోయి 11మీటర్ల లోతుకు చేరి పైకి రానంటుంది. దీంతో బావులు, బోర్లు కూడా అడుగంటి పోయాయి.