24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్న వైద్యులు
ప్రజాపక్షం / హైదరాబాద్ అస్వస్థతకు గురై, స్వల్ప గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కాంటినెంటల్ ఆస్పత్రిల్లో ఆయనకు ఎనిమిది మంది డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సోమవారం సాయం త్రం వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీల పనితీరు కూడా సరిగా లేదని తెలిపారు. ఆ సమస్యలకు మందులు ఇస్తున్నామని, ప్రస్తుతం ఆయన డయాలసిస్ మీద ఉన్నారని తెలిపారు. కార్డియక్ అరెస్ట్ వల్ల మెదడుపై కూడా ప్రభావం పడిందని, ఆయనకు ఇస్తున్న మందులకు స్పందిస్తున్నారని వైద్యులు వివరించారు. అయితే మాట్లాడే పరిస్థితిలో లేరని, 24 గంటలు అయితే తప్ప ఏ విషయం చెప్పలేమని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చికిత్స ఇవ్వాలో అది జరుగుతోందని అని డాక్టర్లు తెలిపారు.
సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమం
RELATED ARTICLES