న్యూఢిల్లీ: గూడచర్యం,అక్రమ ప్రవేశ ఆరోపణలపై పాకిస్థాన్‌లో అరెస్టు జైలు శిక్ష అనుభవించి మంగళవారం విడుదలైన ముంబయి వాసి హమిద్ నిహాల్ అన్సారీ(33) బుధవారం భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌ను కలిసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అన్సారీ తన తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో వచ్చి తాను భారత్‌కు వచ్చేందుకు సహకరించిన విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. సుష్మతో అన్సారీ భేటీ సందర్భంగా ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ జైలులో అన్సారీ పడ్డ ఇబ్బందులను సుష్మ స్వరాజ్‌కు చెప్పుకొని ఆవేదన చెందినట్లు తెలిపారు.
సుష్మను కలిసిన అన్సారీ
RELATED ARTICLES