చెలరేగిన డీకాక్.. రాణించిన సఫారీ బౌలర్లు
తేలిపోయిన భారత బౌలర్లు.. బ్యాట్స్‌మెన్లు
9 వికెట్లతో సౌతాఫ్రికా గెలుపు
సిరీస్‌ను 1-1తో సమం చేసిన డీకాక్‌సేనా
బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లపై క్వింటాన్ డికాక్ చెలరేగాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ లైన్ తరలించి కసి తీర్చుకున్నాడు. 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో విధ్వంసకర ఇన్నింగ్‌తో భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడి 52 బంతుల్లో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలవడంతో పాటు జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 16 ఓవర్లలోనే భారత్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సమం చేశారు సఫారీలు. రీజా హెన్‌డ్రిక్స్(28), తెంబా బవుజా(27 నాటౌట్)లు అతనికి తోడుగా రాణించడంతో సఫారీ జట్టు భారత జట్టుపై 9 వికెట్లతో విజయం సాధించి. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి.. ప్రొటీస్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ శిఖర్ ధావన్ టాప్ స్కోరర్ (36). కాగిసో రబాడ మూడు వికెట్లు తీసాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (9) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. దీంతో 5 భారత్ ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లో ధావన్ రెండు సిక్సులు బాదంతో స్కోర్ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో భారీ షాట్ ఆడిన ధావన్ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లో కోహ్లీ (9) కూడా భారీ షాట్ ఆడి నిష్క్రమించాడు. ప్రొటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ 10 ఓవర్లలో మూడు వికెట్లకు 76 పరుగులు చేసింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నా.. స్కోర్ బోర్డు వేగం మాత్రం పెరగలేదు. పంత్ (19) కొద్దిసేపు క్రీజులో ఉన్నా .. అయ్యర్ (5), కృనాల్ (4) పూర్తిగా నిరాశపరిచారు. హార్దిక్ పాండ్యా (14), జడేజా (19) క్రీజులో ఉన్నా.. వేగంగా ఆడలేకపోయారు. ఇన్నింగ్స్ చివరలో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. చివరి 10 ఓవర్లలో భారత్ 58 పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబాడా 3 వికెట్లు పడగొట్టాడు.
ఇద్దరూ 9 పరుగులే..
అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన టాప్‌ను కాపాడుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ప్రారంభానికి ముందు కోహ్లి రికార్డును రోహిత్ సవరించి మళ్లీ అగ్రస్థానానికి చేరతాడని అతని ఫాన్స్ ఊహించారు. కాకపోతే రోహిత్ శర్మ ఆదిలోనే నిరాశ పరిచాడు. బి హెండ్రిక్స్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి రోహిత్(9) పెవిలియన్ చేరాడు. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ఆర్ హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లో బ్యాట్ ఝుళిపించిన కోహ్లిని రబడా ఔట్ చేశాడు. మిడ్ వికెట్ మీదుగా కోహ్లి భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫెహ్లుక్వోయో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే ఇక్కడ రోహిత్-కోహ్లిలు తమ వ్యక్తిగత స్కోరు 9 పరుగుల వద్ద ఔట్ కావడం గమనార్హం. మ్యాచ్‌కు ముందు కోహ్లి వర్సెస్ రోహిత్‌లు పోరు అనుకుంటే, ఇద్దరూ సేమ్ టు సేమ్ ఒకే సంఖ్య వద్ద ఔటయ్యారే అనుకోవడం అభిమానుల వంతైంది.
సిరీస్ సమం
RELATED ARTICLES