డబుల్ హ్యాట్రిక్స్‌తో చెలరేగిన దీపక్
బ్యాట్ రాణించిన రాహుల్, శ్రేయాస్
చివరి వన్డేలో 30 పరుగులతో విజయం
1-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
నాగ్‌పూర్ : సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ 20లో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్‌లో కెఎల్ రాహుల్(52), శ్రేయాస్ అయ్యర్(62) పరుగులతో చెలరేగితే.. బౌలింగ్ దీపక్ చహార్ 6/7, శివమ్ ధూబే 3/30లతో రాణించారు. దీంతో భారత్ 30 పరుగులతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-2తో కైవసం చేసుకుంది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో మహమ్మద్ నయీం(81), మహమ్మద్ మిథున్(27) మినహా మరెవరూ రాణించలేక పోవడంతో ఈ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్(2, ధవన్(19) ఫెయిల్ అయినా.. కేఎల్ రాహుల్(35 బంతుల్లో 52 పరుగులు), శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 62 పరుగులు)లు రాణించడంతో భారత జట్టు 174 పరుగులు చేయగలిగింది. చివర్లో మనీష్ పాండే కూడా చెలరేగి ఆడాడు. 13 బంతుల్లో 22 పరుగులు చేశాడు. దీంతో మొదట్లో భారత్ 150 పరుగులు కూడా చేయదనుకున్న భారత్.. చివరికి 5 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేయగలిగింది. రోహిత్, ధవన్ విఫలం కావడంతో 35 పరుగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత బంగ్లా బౌలర్లపై చెలరేగింది. రాహుల్ స్ట్రోక్ ప్లే అదరగొట్టగా శ్రేయస్ సిక్సర్లతో చెలరేగాడు. పంత్ (6) మరోసారి నిరాశపరిచాడు. ఆఖర్లో మనీశ్ పాండే బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 174 పరుగులు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో ఫఫియుల్, సౌమ్య సర్కార్ చెరో 2, అల్ అమిన్ ఒక వికెట్ తీశాడు.
ఓపెనర్లు వెనువెంటనే..
టాస్ గెలిచిన బంగ్లా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగలింది. గత మ్యాచ్ హీరో రోహిత్ (2)ను షఫీల్ క్లీన్‌బౌల్ చేశాడు. అనంతరం ధావన్(19) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టును ఆదుకునే బాధ్యత అయ్యర్, రాహుల్‌లపై పడింది. తొలుత ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఒక్కసారి క్రీజులో సెటిల్ అయ్యాక బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. ఇదే క్రమంలో రాహుల్ అర్దసెంచరీ సాధించాడు. ఇక రాహుల్ ఔటయ్యాకు అయ్యర్ విశ్వరూపం ప్రదర్శించాడు. అఫిఫ్ బౌలింగ్‌లో వరుసగా మూడు భారీ సిక్సర్లు సాధించాడు. దీంతో టీ20ల్లో తొలి అర్దసెంచరీ సాధించాడు. మరోవైపు పంత్(6) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక అయ్యర్ నిష్క్రమణ తర్వాత పాండే తన బ్యాట్‌కు పనిచెప్పడంతో బంగ్లాకు టీమిండియా మంచి స్కోర్ నిర్దేశించగలగింది.
సిరీస్ భారత్‌దే!
RELATED ARTICLES