రాణించిన టాప్ ఆర్డరర్స్.. చెలరేగిన బౌలర్లు
67 పరుగులతో విండీస్ చిత్తు
2-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
ముంబయి : స్వదేశంలో టీమిండియా విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇటీవలె బంగ్లాదేశ్, దక్షిణాప్రికా వంటి జట్లను చిత్తు చేసి పంపిన కోహ్లీసేన ఇప్పుడు విండీస్‌ను టార్గెట్ చేసింది. అందులో భాగంగానే తొలుత జరిగిన మూడు మ్యచ్‌ల టి20 సిరీస్‌ను 2-1 కైవసం చేసుకుంది. తిరువనంతపురంలో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడినా ఎటువంటి ఆత్మవిశ్వాన్ని కోల్పోకుండా వాంఖడేలో జరిగిన మూడో మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాప్ ఆర్డరర్స్ టాప్ లేపితే.. బౌలర్లు విండీస్‌ను బెంబేలెత్తించారు. ఫలితంగా భారత్ వరుసగా 13వ సిరీస్‌ను కైవసం చేసుకొని పలు రికార్డులు నెలకొల్పించి. 241 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన కరేబియన్లు భారత బౌలర్ల ధాటికి 18 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిమ్రాన్ హెట్మేయిర్(41), సారధి కిరోన్ పొలార్డ్(68) తప్ప మరెవరూ రాణించకపోవడంతో 67 పరుగులతో భారీ ఓటమిని మూటగట్టుకుని సిరీస్‌ను కోత్పోయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2/41, దీపక్ ఛహార్ 2/20, మహమ్మద్ షమీ 2/25, కుల్‌దీప్ యాదవ్ 2/45 సమష్టిగా రాణించి విండీస్ నడ్డీ విరిచారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత బ్యాట్స్‌మెన్లు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వాళ్లు బంతులు వేయడమే ఆలస్యం బౌండరీలకో లేదా సిక్సర్లకు తరలించేశారు. ముందుగా టాస్ గెలిచిన విండీస్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పది ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా స్కోర్ 116. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 10 ఓవర్లకు రోహిత్ శర్మ 29 బంతుల్లో 63 పరుగులు చేయగా.. రాహుల్ 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత వారి దూకుడు కొనసాగింది. రోహిత్ శర్మ 71 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికే భారత్ స్కోర్ 135. వన్ డౌన్‌లో హిట్టర్‌గా వచ్చిన రిషిబ్ పంత్ కేవలం రెండు బంతులే ఎదుర్కొని పోలార్డ్ బౌలింగ్‌లో షార్ట్‌కు ప్రయత్నించి డక్ అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ సైతం కేఎల్.రాహుల్‌కు అండగా నిలిచి విరుచుకు పడ్డాడు. కోహ్లీ 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఇక 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు మొత్తం 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి విండీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. కోహ్లీ – రాహుల్ జంట కూడా ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో విండీస్ బౌలర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇక కేఎల్. రాహుల్ 91 పరుగులు చేసి చివరి ఓవర్లో మరో రెండు బంతులు మిగిలి ఉండగా అవుట్ అయ్యాడు. కార్టెల్ బౌలింగ్‌లో కీపర నికోలస్ పూరాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కోహ్లీ 70 పరుగులు చేసి, శ్రేయాస్ అయ్యర్ 0 పరుగులు చేశాడు.
కోహ్లీ 1000 పరుగులు
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు. హేడెన్ వాల్స్ వేసిన 14వ ఓవర్ ఆఖరి బంతిని సిక్స్‌గా మలచడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కి ముందు ఈ మైలురాయిని అందుకోవడానికి కోహ్లీ మరో 6 పరుగుల దూరంలో ఉన్నాడు. రిషబ్ పంత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరింత దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు న్యూజిలా్‌ండ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(1430), కోలిన్ మున్రో(1000) ఈ ఘనత సాధించారు. సొంతగడ్డపై విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 29 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ పరుగులు సాధించాడు.
400 సిక్సర్ల క్లబ్‌లో రోహిత్
రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో వాంఖడే వేదికగా విండీస్ తో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ కాట్రెల్ బౌలింగ్‌లో మి్‌డ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. వరల్డ్ క్రికెట్‌లో ఇప్పటి వరకూ క్రిస్‌గేల్, అఫ్రిది మాత్రమే ఈ 400 సిక్సర్ల మార్క్‌ని అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్‌గేల్ 462 మ్యాచ్‌ల్లో 534 సిక్సర్లు నమోదు చేయగా.. ఆ తర్వాత పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది 524 మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా 354వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ 400 సిక్సర్లతో మూడో స్థానానికి ఎగబాకాడు. సుదీర్ఘ కెరీర్‌లో 218 వన్డేలాడిన రోహిత్ శర్మ 232 సిక్సర్లు, 104 టీ20ల్లో 116 సిక్సర్లు, 32 టెస్టుల్లో 52 సిక్సర్లు నమోదు చేశాడు. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మహేంద్రసింగ్ ధోని 359 సిక్సర్లు (538 మ్యాచ్‌లు), సచిన్ టెండూల్కర్ 264 సిక్సర్లు (664 మ్యాచ్‌ల్లో) టాప్ -3లో కొనసాగుతున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 398 మ్యాచ్‌ల్లో 206 సిక్సర్లతో కొనసాగుతున్నాడు.
స్కోరు బోర్డు సంక్షిప్తం
భారత్: 240/3
వెస్టిండీస్: 173/8
సిరీస్ కోహ్లీసేనదే!
RELATED ARTICLES