ప్రజాపక్షం/నల్లగొండ : సీపీఐ సీనియర్ నాయకుడు నల్గొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామానికి చెందిన పందిరి మోహన్ రెడ్డి(69) మృతి కి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి శనివారం చనిపోవడం జరిగింది. యువజన సమాఖ్య నాయకునిగా,మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మూడు సార్లు చందంపేట సిపిఐ మండల కార్యదర్శి గా ఉమ్మడి నల్లగొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా చాలా సంవత్సరాలు పని చేశారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించారని పల్లా వెంక రెడ్డి పేర్కొన్నారు.ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఉన్న ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం లో పాల్గొన్నారని అన్నారు. నిర్మాణాత్మకంగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ప్రజా ప్రతినిధిగా చేసే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా పదవీ వ్యామోహం లేకుండా పార్టీ కోసం పని చేశాడని అన్నారు.మండలంలో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన మోహన్ రెడ్డి అంత్యక్రియలలో కరోణా లాక్ డౌన్ సందర్భంగా ప్రత్యక్షంగా పాల్గొన్న లేకపోవడం బాధాకరం గా ఉందని ఆయన తెలిపారు. తాగు సాగు నీరు ప్రాజెక్టుల సాధన ఉద్యమంలో రైతాంగ సమస్యలపై పోరాటాలలో ముందు భాగంలో ఉండి పాల్గొన్నారని తెలిపారు.ప్రస్తుతం మోహన్ రెడ్డి భార్య ముడుడండ్ల గ్రామ ఉప సర్పంచ్ గా పనిచేస్తున్నారు.మోహన్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు, రాష్ట్ర సమితి తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని పల్లా వెంకట్ రెడ్డి తెలియజేశారు.
సిపిఐ నాయకులు పందిరి మోహన్ రెడ్డి మృతికి సంతాపం
RELATED ARTICLES