ఎస్‌సి, ఎస్‌టిలపై పెరిగిన దమనకాండ
న్యూఢిల్లీ: సామాజికంగా వెనకబడిన ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే పెద్దఎత్తున ప్రకటనలు గుప్పించే నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర సర్కారు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. ఎస్‌సి, ఎస్‌టిలపై దమనకాండ నిరాటంకంగా కొనసాగుతున్న విషయాన్ని పార్లమెంటు వేదికగా ప్రభుత్వం అంగీకరించింది. అయితే, ఈ అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అందించిన వివరాల ప్రకారం, అంతకు ముందు కాలంతో పోలిస్తే, 2019 సంవత్సరంలో ఎస్‌సిలపై 7.3 శాతం, ఎస్‌టిలపై 26.5 శాతం చొప్పున దాడులు లేదా అకృత్యాల కేసులు పెరిగాయి. అయితే, రాజ్యాంగంలోని ఏడో అధికరణ ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ఆయా రాష్ట్రాల పరిధిలోకే వస్తాయని అన్నారు. 2019 సంవత్సరానికి ప్రకటించిన క్రైమ్ నివేదికను అనుసరించి ఎస్‌సి, ఎస్‌టిలపై నేరాలు పెరిగాయని అన్నారు.
క్రిమినల్ చట్టాలపై కమిటీ
దేశంలో అమలవుతున్న క్రిమినల్ చట్టాల్లో సంస్కరణల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీ వైస్ చాన్స్‌లన్ ఈ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని తెలిపారు.
సిగ్గు సిగ్గు
RELATED ARTICLES