HomeNewsNationalసిఐఎస్‌ఎఫ్‌ అదుపులో పార్లమెంట్‌

సిఐఎస్‌ఎఫ్‌ అదుపులో పార్లమెంట్‌

ఇకపై కాలిబూట్లు సహా ఆపాద మస్తకం స్కానింగ్‌
అధికారులు, విజిటర్ల స్మార్ట్‌ఫోన్లపై ఆంక్షలు
శాశ్వత ప్రాతిపదికపై 140 మంది కేటాయింపు
31 నుండి బడ్జెట్‌ సమావేశాలు
న్యూఢిల్లీ :
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుండి ప్రారంభమవుతుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 140 మంది సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని పార్లమెంటు భవనం వద్ద మోహరించారు. సందర్శకులపై గట్టినిఘా వేసేందుకు, వారు వెంట తెచ్చుకునే వివిధ వస్తువులను క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకు వీలుగా ఈ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్స్‌రే యంత్రాలద్వారా ఈ తనిఖీలు జరుగుతాయి. చేతుల్లోనే డిటెక్టర్లు ఉంచుకుంటారు. ప్రతి వ్యక్తీ వేసుకొచ్చే బూట్లు, చెప్పులను కూడా స్కానింగ్‌ చేస్తారు. హెవీ జాకెట్లనుకూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అధికారులు, విజిటర్ల స్మార్ట్‌ఫోన్లపై కఠినమైన ఆంక్షలు
అమలు చేస్తారు. పార్లమెంటు రక్షణ, పార్లమెంటు సభ్యుల రక్షణ, అత్యున్నతస్థాయీ ప్రముఖులు, సిబ్బంది రక్షణే ప్రధానలక్ష్యం అని కొత్తగా జారీ చేసిన సర్క్యులర్‌ స్పష్టం చేసింది. ఈ 140 మంది భద్రతా సిబ్బందీ శాశ్వత ప్రాతిపదికపై విధులు నిర్వహిస్తారు. గడచిన శీతాకాల సమావేశాల్లో డిసెంబరు 13న విజిటర్స్‌ గ్యాలరీ నుండి ఇద్దరు యువకులు లోక్‌సభలోకి ఉరికి రంగు బాంబులు విసిరి ఉద్రిక్తతలు సృష్టించిన నేపథ్యంలో పార్లమెంటు భవన వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ యువకులు ఇద్దరూ తమ కాలి బూట్లలో బాబులు దాచుకుని వచ్చారు. అందువల్ల ఇకమీదట ఆపాద మస్తకం బూట్లతో సహా స్కానింగ్‌ చేస్తేగానీ లోపలికి పంపించరు. కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా పార్లమెంటు భద్రతపై సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారంనాడు 140 మంది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు పార్లమెంటు భవనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇకమీదట వారు అడుగడుగునా ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ప్రతి 36 మంది సిబ్బందికీ ఒక సిఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ ర్యాంక్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఇప్పటికే ఇతర భద్రతా ఏజన్సీలతో కలిసి వీరు ఈ భద్రత నిర్వహిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పార్లమెంటు భవంతిలో ఉన్నారు. ఈనెల 31 నుండి పూర్తిస్థాయిలో భద్రతను తమ బాధ్యతల్లోకి తీసుకుంటారు. విమానాశ్రయంలో భద్రతాదళం తరహాలో వీరు వ్యవహరిస్తారు. వచ్చిన వారిని తనిఖీ చేస్తారు. శాశ్వత ప్రాతిపదికపైనే ఈ సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నియామకం జరిగింది. ప్రస్తుతం పార్లమెంటులో మోహరించిన ఇప్పటివరకూఉన్న వారిని గవర్నమెంట్‌ బిల్డింగ్‌ సెక్యూరిటీ. వివిధ మంత్రులు, కేంద్ర కార్యాలయాలు, దర్యాప్తు సంస్థలవద్ద భద్రతగా ఉండేందుకు పంపుతారు. సిఐఎస్‌ఎఫ్‌లో ఒక లక్షా 70 వేలమంది కేంద్ర రిజర్వు పోలీసులు ఉన్నారు. వీరంతా కేంద్ర హోంశాఖ నియంత్రణలో పనిచేస్తారు. వీరంతా దేశంలో 68 విమానాశ్రయాలకు భద్రత సమకూరుస్తారు. అత్యంత కీలకమైన వ్యవస్థకు భద్రతగా ఉంటారు. వీటిల్లో అణుకేంద్రాలు, అణుసంస్థలుకూడా ఉన్నాయి. కొత్త పాత పార్లమెంటు భవంతులను ఇతర అనుబంధ భవంతులను కూడా ఈ సిఐఎస్‌ఎఫ్‌ అదుపులోకి తీసుకువచ్చారు. పార్లమెంటు సెక్యూరిటీ సర్వీస్‌గా పిలుస్తారు. ఢిల్లీ పోలీసులలు, పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌ ఇందులో ఉన్నారు. 2001లో ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశాక సిఐఎస్‌ఎఫ్‌, జిబిఎస్‌లను రంగంలోకి దించారు. దేశ రాజధానిలోని కేంద్ర ప్రభుత్వ భవనాలు, నార్త్‌ బ్లాక్‌, సౌత్‌ బ్లాక్‌, క్యాబినెట్‌ సెక్రటరీ, విజ్ఞాన్‌ భవన్‌, యుపిఎస్‌సి భవంతి, సిజిఓ భవంతి, ఇతర భవంతులన్నీ సమగ్ర భద్రతా వలయంలో ఉంటాయి. జిబిఎస్‌ అత్యున్నతస్థాయీ భద్రత సమకూరుస్తుంది. దేశద్రోహ కార్యకలాపాలకు సంబంధించిన తనిఖీలు కూడా చేస్తుంది. అయితే 2001లో ఉగ్రవాద దాడి వార్షిక స్మారక దినం సందర్భంగా 2023 డిసెంబరు 13న భారీస్థాయిలో భద్రతా వైఫల్యం బయటపడింది. ఇద్దరు యువకులు సందర్శకుల గ్యాలరీలోంచ లోక్‌సభలోకి దూకి సమస్యలు తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణహాని లేదు. లేకపోతే దేశానికి చాలా పెద్ద నష్టం జరిగి ఉండేది.
ఫొటోలు తియ్యొద్దు
పార్లమెంటు సిబ్బందికి హెచ్చరిక

పార్లమెంటు భవనం లోపల ఎవ్వరూ ఫొటోలు తియ్యకూడదని, వాటిని షేర్‌ చేయడం వంటి ఇతరత్రా నేరాలకూ కూడా పాల్పడకూడదని సిబ్బందికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఈ నెల 19వ తేదీన ఒక సర్క్యులర్‌ జారీ అయ్యింది. ప్రొటోకాల్‌ ప్రకారం పార్లమెంటు భవంతి లోపలా వెలుపలా ప్రాంగణంలో ఫొటోలు తీయడం నిషిద్ధం. ఈ విధమైన చర్యలను గమనిస్తూ ఉంటారు. పదే పదే గతంలో హెచ్చరికలు జారీ చేసినాగానీ తరచు ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయని పార్లమెంటు భవనం భద్రతా విభాగం సంయుక్త కార్యదర్శి తన సర్కులర్‌లో ఈ విషయం ప్రస్తావించారు. “పార్లమెంటు భవన సముదాయం మనదేశంలో అత్యంత ప్రమాదకరస్థాయిలో హెచ్చరికలకు గురవుతున్న ప్రాంతంగా మారిపోయింది, వ్యూహాత్మకమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో భాగంగా కొత్త ఏర్పాట్లు చేశారు. కెమేరాలు, నిఘా నేత్రాలు, స్మార్ట్‌ ఫోన్లు పార్లమెంటు భవన సముదాయ భద్రతకు ప్రత్యక్ష ప్రమాదంగా మారాయి, అందువల్ల అధికారులకు, సిబ్బందికి ఈ హెచ్చరికలు చేస్తున్నాం” అని ఈ నెల 19న జారీ చేసిన సర్క్యులర్‌ పేర్కొంది. అధికారులు, విజిటర్లు పార్లమెంటు భవంతిలోకి తెచ్చుకునే స్మార్ట్‌ఫోన్లపై కఠిన అంక్షలు అమలు చేస్తారు.
గణతంత్ర వేడుకలకు
కశ్మీలో భద్రత కట్టుదిట్టం

గణతంత్ర వేడుకల సందర్భంగా కశ్మీరులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గణతంత్రవేడుకలు కశ్మీరులోయలో ప్రశాంతంగా సక్రమంగా జరిగేవిధంగా ముందునుండీ భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్‌ నగరంలో పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. ఇతర జిల్లా కేంద్రాలలో కూడాభద్రత కట్టుదిట్టం చేశారు. తనికీ కేంద్రాలు పెట్టారు. శ్రీనగర్‌లోని వివిధ ప్రాంతాలలో తనికీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నార. జమ్మూలో ప్రధానంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పాల్గొనే గణతంత్ర వేడుకలు జరుగుతాయి. కశ్మీరులో ఇదే అతిపెద్ద కార్యక్రమం. భక్షీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కేంద్రాలలో కూడా ఈ వేడుకలు ప్రముఖంగా నిర్వహిస్తారు. బక్షీ స్టేడియంలో బహుముఖ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.కశ్మీరు ఐజీ వి.కె.బిర్దీ పిటిఐ వార్తాసంస్థకు ఈ విషయం చెప్పారు. ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు తెలిస్తే సమాచారం చెప్పాలని ప్రకటన జారీ అయ్యింది. కాగా కశ్మీరు డిజిపి ఆర్‌.ఆర్‌.స్వెయిన్‌ గడచిన శనివారంనాడు భద్రతా చర్యలపై అత్యున్నతస్థాయీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. బక్షీ స్టేడియంలో, జిల్లా కేంద్రాలలో బుధవారంనాడు డ్రెస్‌ రిహారల్స్‌ కూడా కొనసాగుతాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments