కార్పొరేట్ సామాజిక బాధ్యత భావనకు తూట్లు
కాలుష్యాన్ని వెదజల్లుతున్న కాగితపు పరిశ్రమ
పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి
రోగాల బారిన పడుతున్న ప్రజానీకం
భద్రాచలం : భద్రాచలంలోని ఐటిసి పిఎస్‌పిడి అంటే దేశంలోనే అగ్రగామి సంస్థ. గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో దానిని ఇక్కడి ఏర్పాటు చేశారు. ఈ కర్మాగారం వల్ల ఇక్కడి ప్రజలకు అందే ఉపాధిని పక్కన పెడితే పట్టి పీడించే రోగాలే ఎక్కువ. ఈ పరిశ్రమ లీలలు చూస్తుంటే ఎవరైనా నవ్విపోక తప్పదు. పరిశ్రమ నుండి వెలువడుతున్న జల, వాయి కాలుష్యంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. కోటాను కోట్ల లాభాలను గడిస్తున్న ఈ సంస్థ తమ లాభాల్లో నుంచి 2 శాతం ఈ ప్రాంతాభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ మేరకు చేసిన అభివృద్ధి నామమాత్రమనే చెప్పాలి. ఐటిసి నుంచి వెలువడే వ్యర్థ జలాలను నేరుగా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. దీంతో జలమంతా కాలుష్య భరితంగా మారుతోంది.
సిఎస్‌ఆర్ పాలసీ బుట్టదాఖలు
RELATED ARTICLES