ప్రజాపక్షం / హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభాపక్షం (సిఎల్‌పి) నాయకులుగా మధిర శాసనసభ్యులు మల్లు భట్టివిక్రమార్క నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్‌గాంధీ శుక్రవారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సిఎల్‌పి పదవి కోసం టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, మొదటి నుండి భట్టినే రేసులో ముందున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఎఐసిసి పరిశీలకులు కె.సి.వేణుగోపాల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎల నుండి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఏకాభిప్రాయం రానప్పటికీ, మెజారిటీ సభ్యులు భట్టి విక్రమార్క పేరును సూచించినట్లు తెలిసింది. చివరకు సిఎల్‌పి సమావేశంలో రాహుల్‌గాంధీకే సిఎల్‌పినేత ఎంపిక అధికారాన్ని కట్టబెడుతూ ఏకవాక్య తీర్మానం చేసి పంపారు. అనంతరం వేణుగోపాల్ అధినేత రాహుల్‌గాంధీకి ఎంఎల్‌ఎలు, పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు వివరించారు. ఎక్కువ మంది సూచించిన మేరకు రాహుల్‌గాంధీ కూడా భట్టి విక్రమార్క వైపే మొగ్గు చూపారు. ఆయననే సిఎల్‌పి నేతగా నియమించారు. దీంతో శాసనసభలో క్యాబినెట్ ర్యాంక్‌తో కూడిన ప్రతిపక్ష నాయకుని హోదా కూడా భట్టికే దక్కనుంది.
అంచెలంచెలుగా ఎదిగి : మల్లు భట్టి విక్రమార్క 1961 జూన్ 15వ తేదీన మల్లు అఖిలాండ, మాణిక్యం దంపతులకు జన్మించారు. ఆయన భార్య నందిని, కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర. భట్టి విక్రమార్క స్వగ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తరువాత హైదరాబాద్‌లో పైచదువులు చదువుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎ పూర్తి చేవారు. ఎన్‌ఎస్‌యుఐ నుండి కాంగ్రెస్‌తో అనుబంధం పెంచుకున్న భట్టి పిన్న వయసులోనే 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిసిసి కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు.1995లో ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ఆంధ్రాబ్యాంక్ రైతులకు, విద్యార్థుల కోసం డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డ్, డాక్టర్ పట్టాభి విద్యా జ్యోతి పథకాలను ప్రవేశపెట్టడంలో ఆయన కూడా పాత్ర పోషించారు. 1999 నుండి 2003 వరకు ఎపిసిసి కార్యదర్శిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2015 నుండి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.
సిఎల్‌పి నేతగా భట్టి
RELATED ARTICLES