తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం అసెంబ్లీలో తీర్మానించాలని నిర్ణయం
ప్రజాపక్షం / హైదరాబాద్: భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మత పరమైన వివక్ష చూపరాదని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిం ది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన పౌరసత్వ సవరణ చట్టం (‘సిటిజెన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్టు సిఎఎ) రద్దు చేయాలని మంత్రివర్గం కోరింది. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.