19 ఒప్పందాలు, రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750 ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చిన విదేశీ కంపెనీలు : రాష్ట్రానికి సిఎం రేవంత్
ప్రజాపక్షం/హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ బృందం అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అనే నినాదంతో ముఖ్యమంత్రి అమెరికాలో పర్యటించారు. ఇక నుంచి ‘తెలంగాణ& ప్యూచర్ స్టేట్’ అనే ట్యాగ్ లైన్ తెలంగాణ రాష్ట్రాన్ని పిలవనున్నట్లు సిఎం రేవంత్ ప్రకటించారు. పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి బృందం ప్రయత్నించి విజయం సాధించింది. అమెరికా పర్యటనలో 50 బిజినెస్ మీటింగ్స్ పాటు మూడు రౌండ్ టేండ్ సమావేశాలలో సిఎం రేవంత్ బృందం
పాల్గొన్నది. ఐటిఇఎస్, ఎఐ, ఫార్మా లైఫ్ సైన్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, డాటా సెంటర్స్ అండ్ మానిఫ్యాక్చరింగ్ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నెల 2వ తేదీన అమెరికా, దక్షిణ కొరియా వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్రానికి తిరిగి రానుంది. అమెరికా అనంతరం దక్షిణ కొరియాలో పర్యటించిన రేవంత్ అక్కడ నుంచి నేరుగా మంగళవారం తెల్లవారు జామున ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్ రానున్నారు. రేవంత్ బృందం పర్యటనలో మొత్తం 19 అవగాహన ఒప్పందాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి కు 31,500 కోట్ల పెట్టుబడులతో పాటు 30,750 ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణలో పెట్టుబడులకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చుతాయని, పెట్టుబడుల వల్ల వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని సిఎం రేవంత్ బృందం తమ పర్యటన సందర్భంగా విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.