సిద్ధపడిన మమతా బెనర్జీ
ఏకగ్రీవంగా తిరస్కరించిన తృణమూల్ కాంగ్రెస్
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అనుకున్న స్థానాలు లభించకపోవడంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఇక కొనసాగలేనని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె నిర్ణయాన్ని పార్టీ తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం మమతాబెనర్జీ తొలిసారి శనివారం మీడి యా సమావేశం ఏర్పాటు చేశా రు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలని అనుకోవడం లేదని ప్రకటించా రు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, పార్టీ గుర్తు ముఖ్యమని స్పష్టం చేశారు. తాను ఆరు నెల లు పని చేయలేకపోయానని పార్టీకి చెప్పినట్లు ఆమె తెలిపారు. అయితే పార్టీ తన నిర్ణయాన్ని తిరస్కరించి, సిఎం కొనసాగాలని నిర్ణయించిందన్నారు. మతల వారీగా ప్రజలను బిజెపి విభజించి ఓట్లు పొందిందని మమతా ఆరోపించారు. కాగా, బెంగా ల్ రాష్ట్రంలో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్ 22 ఎంపి స్థానాలను కైవసం చేసుకుంది. బిజెపి 18 ఎంపి స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది.
సిఎం పదవికి రాజీనామా చేస్తా
RELATED ARTICLES