పిఆర్‌సి సిఫార్సులు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు, విజ్ఞప్తులపై సిఎస్ సోమేశ్ కుమార్ హామీ
ప్రజాపక్షం / హైదరాబాద్ పిఆర్‌సి సిఫార్సులపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, విజ్ఞప్తులు, ఇతర అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీనిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీతో గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో ఎస్‌టియుటిఎస్, పిఆర్‌టియుటిఎస్, తెలంగాణ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ తెలంగాణ గవర్నమెంట్ డ్రైవర్ సెంట్రల్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. కమిటీ ఐదు అసోసియేషన్ల సభ్యులతో విడివిడిగా సమావేశమై పిఆర్‌సి సిఫార్సులు, ఇతర ఉద్యోగ సమస్యలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు విన్నారు. ఈ చర్చలలో త్రిసభ కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణా రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌తో పాటు పిఆర్‌టియు టిఎస్ నేత, ఎంఎల్‌సి రఘోత్తంరెడ్డి, అధ్యక్షులు పి.శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.కమలాకర్‌రావు, ఇన్నారెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి, టిఎస్‌యుటిఎఫ్ అధ్యక్షులు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, ఎ.వెంకట్, ఉపాధ్యక్షులు సి.హెచ్.దుర్గా భవాని, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నే ప్రభాకర్, ఉపాధ్యక్షులు నిరంజన్‌రావు, కార్యదర్శి బానాల రామ్‌రెడ్డి, నాగమణి, మాధవిరెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి.జ్ఞానేశ్వర్, ఖాధర్ బిన్ హసన్, పి.లక్ష్మణ్‌రావు, కె.ధన్‌రాజ్, ఎ.సత్యరాజ్, ఎస్.క్రిష్ణవేణి, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కె.నర్సింగ్‌రావు, ప్రధానకార్యదర్శి మహ్మద్ యూసుఫుద్ధీన్, చంద్రశేఖర్, ఎండి జలీలుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వివిధ ఉద్యోగుల సంఘాలతో చర్చల ప్రక్రియలో భాగంగా సిఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ మూడు ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టియుటిఎస్), ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పిఆర్‌టియు), తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టియుటిఎఫ్) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టియుసిటిఎస్) అధ్యక్షులు జి.సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శిపర్వత్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు బి.భుజంగరావు, నాయకులు పి.ప్రవీన్ కుమార్, పి.రామసుబ్బారావు, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పిఆర్‌టియు) సభ్యులు ఎం.అంజి రెడ్డి, ఎం.చెన్నయ్య, గిరిధర్ రెడ్డి, అనంతరెడ్డి, అబ్దుల్ హమీద్, తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టియుటిఎఫ్) అధ్యక్షులు డి.మల్లా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్.బాబు, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ డి.శ్రీనివాస్ , సభ్యులు పి.రఘునందన్ రెడ్డి, జె.కైలాసం పాల్గొన్నారు.
కనీస వేతనం రూ.27,300, ఇంక్రిమెంట్ 2.61 నుంచి 3కు పెంచాలి ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.27,300లు, గరిష్ట వేతనం రూ.2,55,000 లుగా ఉండాలని, ఇంక్రిమెంట్ రేట్ 2.61 నుంచి 3 వరకు నిర్ణయించాలని ఎస్‌టియుటిఎస్ సిఎస్ సోమేష్‌కుమార్ నేతృత్వంలోని తిసభ్య కమిటీని కోరింది. సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించాలని, డిఎస్‌సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని, స్టాగినేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ 8 కావాలని, రాష్ట్ర కరువు భత్యం కేంద్ర ప్రభుత్వ కరువు భత్యంతో సమానం 1:1గా ఉండాలని ఎస్‌టియుటిఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి.సదానందగౌడ్, ప్రధానకార్యదర్శి పర్వత్‌రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు భుజంగరావుతో కూడిన ప్రతినిధి బృందం గురువారం చర్చల సందర్భంగా సిఎస్ సోమేష్‌కుమార్‌కు ఒక విజాపన పత్రాన్ని సమర్శించింది. పిఆర్‌సి నివేదికలోని అసంబద్దతలను తొలగిస్తూ సరైన విధంగా ఆమోదయోగ్యంగా నివేదికను అందించి అమలు చేయాలని వారు తిసభ్య కమిటీని కోరారు. గతంలో పిఆర్‌సి కమిటీకి తమ సంఘం ఇచ్చిన ప్రతిపాదనలను ఏ మాత్రం పట్టించుకోకుండా నివేదికను రూపొందించినట్లు ఉందని పేర్కొన్నారు.
సిఎం దృష్టికి తీసుకెళ్తా
RELATED ARTICLES