ఛత్తీస్‌గఢ్ ఆపధర్మ ముఖ్యమంత్రి రమణ్ సింగ్
ప్రజాపక్షం/ భద్రాచలం: కెసిఆర్‌కు పరిపాలన చేతకాకనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, ప్రజలు ఆశలు, ఆకాంక్షలను అవమానించారని, ఎన్నికల వేళ టిఆర్‌ఎస్ పార్టీ ఏఐఎంతో అపవిత్ర పొత్తు పెట్టుకుందని ఛత్తీస్‌గఢ్ ఆపధర్మ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. భద్రాచలం నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కుంజా సత్యవతి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం స్థానిక కొత్త మార్కెట్ ప్రాంగణంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రత్యేక హెలికాప్టర్‌లో విచ్చేశారు. బిపిఎల్ హెలిప్యాడ్‌లో దిగిన ఆయనకు బిజెపి నాయకులు కుంజా సత్యవతి పలువురు సాదర స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ప్రత్యేక వాహనాల్లో సభా ప్రాంగణానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి, ఈ ప్రాంతానికి ఎలాంటి తేడా లేదని, ఇక్కడికి వచ్చినా తమ సొంత ప్రాంతంలోనే ఉన్నట్లుగా ఉందని చెప్పారు.
కెసిఆర్‌కు పాలన చేతకాదు
RELATED ARTICLES