వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న తెలుగు తేజం
ఫైనల్లో ఓకుహరాపై విజయం
బాసెల్: స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. వరుసగా మూడు సార్లు ఫైనల్లో అడుగుపెట్టిన మన బంగారు సింధూ ఈ సారి పసిడి పట్టు పట్టింది. 2017, 2018లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్‌లలో సిల్వర్ మెడల్ సరిపెట్టుకున్న తెలుగు బిడ్డ ఈ సారి పట్టుజారన్వికుండా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణీ ఓకుహరాతో పోటీకి దిగిన సింధూ ఏ దశలోనూ ఓకుహరాను కోలుకోకుండా ఆధిపత్యం చలయించింది. దీంతో 21 21 వరుస గేమ్‌లు గెలుచుకుని వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. తొలి రౌండ్‌లో అదరగొట్టిన పీవీ సింధు రెండో రౌండ్‌లోనూ దూసుకెళ్లింది. రెండో గేమ్‌లోనూ ఆదినుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పైచేయి సాధించింది. 2వ పాయింట్ నుంచి 9 పాయింట్ల వరకు వరుసగా చెలరేగింది. మధ్యలో ఒకుహర రెండు పాయింట్లు సాధించినా సింధూ మళ్లీ జోరు కొనసాగించింది. విరామానికి 11 అదరగొట్టింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి 21- విజేతగా నిలిచింది.
ప్రతికారం తీర్చుకుంది…
2017లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫైనల్ చేరుకున్న సింధూ ఓకుహరా చేతిలో కంగుతిని ఓటమిని మూటగట్టుకొని సిల్వర్‌తో సరిపెట్టుకుంది. 2017లో ఓకుహరాతో హోరాహోరీగా తలపడిన సింధూ మొదటి గేమ్ కోల్పోయినా ఆత్మవిశ్వాసం సడలలేదు. దీంతో రెండో గేమ్‌లో 19 చెలరేగి గెలిచినా మిగితా రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చినప్పటికీ మూడో గేమ్‌లో కేవలం పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో సింధూ 19 22 20 పరాజయంపాలై సిల్వర్‌తో సరిపెట్టుకున్న సింధు ఈసారి అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ గెలుపుతో ఒకుహారా లెక్కను సరిచేశారు. ఒకుహారా ఆటపై మంచి హోంవర్క్ చేసి వచ్చిన సింధు దానిని కోర్టులో అమలు చేశారు. ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన సింధు.. ప్రతీ పాయింట్ కోసం శ్రమించారు.ఎలాగైన స్వర్ణం సాధించాలనే కసితో సింధు ఆట తీరు సాగింది. మరొకవైపు ఫైనల్ ఫోబియాకు చెక్ పెట్టాలనే ఏకైక లక్ష్యమే ఆమెకు స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది.
వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో సింధు..
ఇప్పటి వరకు సింధు వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో రెండు సార్లు కాంస్యం పతకాలు, రెండు సార్లు రన్నరప్‌గా నిలిచి సిల్వర్ పతకాలు, ఒక స్వర్ణ పతకం సాధించింది. 2014, 2014లో వరుసగా రెండు సార్లు కాంస్యంతో సరిపెట్టుకున్న సింధూ 2017, 2018లో పసిడికి గురిపెట్టి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. 2018లో చైనా నంజింగ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఫైనల్ చేరుకున్న సింధూ కరోలినా మార్టిన్‌తో తుదిపోరులో తలపడింది. కానీ ఈ స్పెయిన్ క్రీడాకిరిణి దెబ్బకు సింధూ వరుస గేమ్‌లలో ఓటమిని చవిచూసి వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, అంతకుముందు 2014లో డెన్మార్క్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్‌లోనూ సింధూ కరోలినా చేతిలో కంగుతింది. నువ్వా.. నేనా అన్నట్టు సాగిన సెమీఫైనల్ పోరులో 17 15 ఓటమిని మూటగట్టుకుంది. దీంతో సింధూ కాంస్యంతో వెనుదిరిగింది.
ప్రముఖుల అభినందనలు..
ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న తెలుగుతేజం పీవీ సింధుపై ప్రముఖులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు నరసింహన్, బిశ్వభూషణ్ హరిచందన్.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు అభినందనలు తెలిపారు. అంతేకాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ట్విట్టర్ వేదికగా సింధూను ప్రశంసించారు.
సింధూ నివాసంలో సంబురాలు..
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సింధు తల్లి విజయ, ఇతర కుటుంబసభ్యులు టీవీలో మ్యాచ్‌ను వీక్షించారు. సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ ఈనాడు-ఈటీవీతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సింధు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణిపై గెలవడం టర్నింగ్‌పాయింట్ అని ఆమె వివరించారు. ఆ మ్యాచ్‌లో తొలి సెట్‌లో సింధు సరిగా రాణించలేదని.. అయితే మిగతా రెండు సెట్లలో తిరిగి పుంజుకుని సత్తా చాటిందన్నారు. ఫైనల్‌లో ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడిందని చెప్పారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం సింధు గత ఆరునెలలుగా తీవ్రస్థాయిలో సాధన చేసిందని తెలిపారు. సింధుతో పాటు తామంతా ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం ఎదురుచూశామని విజయ చెప్పారు. “ప్రతిసారీ నా పుట్టినరోజున సింధు ఏదో ఒక బహుమతి ఇచ్చేది. ఈసారి నాకు, ఈ దేశానికి చాలా పెద్ద బహుమతి ఇచ్చింది” అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజే సింధు తల్లి విజయ పుట్టినరోజు కావడం విశేషం.
సింధూ.. బంగారం
RELATED ARTICLES