రెండో రౌండ్లో కిదాంబి శ్రీకాంత్
సైనా, ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటికి, మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్ : మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేస్తే.. మరోవైపు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టారు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ (భారత్) 21 21 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇషాన్ మౌలానా ముస్తాఫాపై వరుస గేమ్‌లో విజయం సాధించి ముందంజ వేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి శ్రీకాంత్, మౌలానా ఇద్దరూ దూకుడుగా ఆడారు. వీరిద్దరి మధ్య తొలి గేమ్ హోరాహోరీగా జరిగింది. నువ్వా..నేనా.. అన్నట్టు సాగిన ఈ గేమ్‌లో ఆఖర్లో కిదాంబి జోరు పెంచి 21 మొదటి గేమ్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత రెండో గేమ్‌లో కిదాంబి మొదటి నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. తన అనుభవంను ఉపయోగిస్తూ వరుస స్మాష్‌లతో మౌలానాను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివర్లో మరింతగా చెలరేగిన శ్రీకాంత్ భారీ తేడాతో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుని రెండో రౌండ్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21 16 14 సితికోమ్ థామసిస్ (థైలాండ్) చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌ను ఈజీగా గెలుచుకున్న ప్రణయ్ ఆతర్వాతి గేమ్‌లలో చేతులెత్తేశాడు.
సైనాకు షాక్..
మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ మొదటి రౌండ్లోనే షాక్ తగిలింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌పై 20 21 21 తేడాతో అన్‌సీడెడ్ చోచువాంగ్ (థైలాండ్) విజయం సాధించింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌ను చెమటోడ్చి నెగ్గిన సైనా తర్వాతి గేమ్‌లలో మాత్రం పోటీ కనబర్చలేక పోయింది. ప్రత్యర్థి దూకుడుముందు సైనా పూర్తిగా తెలిపోవడంతో మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. మరో సింగిల్స్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్, ఐదో సీడ్ పివి సింధు 22 21 జపాన్‌కు చెందిన ఆయ ఒహొరిపై విజయం సాధించి రెండో రౌండ్లో దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి రెడ్డి జోడీ 16 6 తేడాతో ఏడో సీడ్ హన్ చెంగ్కయి హౌడంగ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.