తొలి మ్యాచ్‌లో యామగుపై గెలుపు, సమీర్‌వర్మ ఓటమి
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ
గ్వాంగ్జౌ (చైనా): భారత స్టార్ షట్లర్ పివి సింధు బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ ఓటమితో టోర్నీను ఆరంభించాడు. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్, భారత స్టార్ పివి. సింధు 24 21 తేడాతో జపాన్ స్టార్ క్రీడాకారిణి అకానె యామగుచిపై వరుస గేమ్‌లలో విజయం సాధించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ తొలి మ్యాచ్‌లో 18 6- ప్రపంచ నెంబర్‌వన్ కెంటొ మొమోటా (జాపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. గత ఏడాది జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీల్లో సంచలనాలు సృష్టించిన సింధు ఈ ఏడాది మాత్రం తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయింది. ఈ సీజన్లో తడబడుతూ కొన్ని టోర్నీలా ఫైనల్స్‌లో ప్రవేశించినా.. టైటిల్ మాత్రం నెగ్గలేకపోయింది. అయితే ఈ సీజన్లో సింధుకు టైటిల్ గెలువడానికి ఈ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ చివరి అవకాశం.
హోరాహోరీలో సింధుదే పైచెయ్యి..
గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన సింధు ఈ సీజన్లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. ప్రపంచ అగ్రశ్రేణి 8 మంది క్రీడాకారులు తలపడే ఈ మెగా టోర్నమెంట్‌ను భారత స్టార్ పివి సింధు గెలుపుతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లోనే ఎదురైన కఠిన సవాలును అధిగమించి గొప్ప విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇకడ జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు సాగింది. మరోవైపు జపాన్ సంచలనం యామగుచి కూడా తనదైన శైలిలో ఆడుతూ సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరి మధ్య తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. నువ్వానేనా అన్నట్టు జరిగిన ఈ గేమ్‌లో ఇద్దరూ ఒకరిపై మరొకరు ఎదురుదాడులు చేసుకున్నారు. మధ్యలో యామగుచి దూకుడును పెంచడంతో సింధు 6- వెనుకబడిపోయింది. తర్వాత తేరుకున్న సింధు ప్రత్యర్థిపై వరుస దాడులు చేస్తూ మ్యాచ్‌లో తిరిగి పట్టు సాధించడంతో ఇద్దరి మధ్య తిరిగి హోరాహోరీ ఆట మొదలైంది. చివర్లో వీరిద్దరూ 19- పాయింట్లు సాధించి మ్యాచ్‌లో ఉత్కంఠను తారాస్థాయికి చేర్చారు. అయితే ఈ సమయంలో యామగుచి దూకుడును ప్రదర్శించినా.. మరోవైపు సింధు తెలివిగా ఆడుతూ పాయింట్లు సాధించింది. చివరికి ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించిన సింధు తొలి గేమ్‌ను 24- గెలుచుకుంది. తర్వాతి గేమ్‌లో అదే జోరును కొనసాగించిన సింధు జపాన్ ప్రత్యర్థిపై ఎదరుదాడికి దిగింది. ఆమెకు అవకాశం ఇవ్వకుండానే వరుసగా పాయింట్లు చేస్తూ ముందుకు సాగింది. చివరికి 21- రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సింధు సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎ మరో మ్యాచ్‌లో తైజు యింగ్ (చైనీస్ తైపీ) 21 21- బివెన్ జాంగ్ (అమెరికా)ను ఓడించింది.
సమీర్ వర్మకు నిరాశే..
గ్రూప్-బిలో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ సమీర్ వర్మకు నిరాశే ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్, జపాన్ స్టార్ కెంటొ మొమోటా 21 21 తేడాతో సమీర్ వర్మ (భారత్)ను ఓడించాడు. తొలి గేమ్‌లో పోటీనిచ్చిన సమీర్ వర్మ రెండో గేమ్‌లో మాత్రం తేలిపోయాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన మొమోటా ఈజీగా మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ గ్రూప్ మరో మ్యాచ్‌లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియర్తో 21- 18- 21- తేడాతో కాంటపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు.
సింధు శుభారంభం
RELATED ARTICLES