చైనా ఓపెన్ సిరీస్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన ప్రపంచ ఛాంపియన్
ఫుజౌ : చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో పివి సింధూ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. తన కన్నా తక్కువ ర్యాంకు షట్లర్ పాయ్ యు (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ పీవీ సింధు 13-21, 21-18, 1921 తేడాతో ఓటమి చవిచూసింది. 74 నిమిషాల పాటు జరిగిన పోరులో ఆమె తొలిగేమ్‌ను చేజార్చుకొని వెనకబడింది. పుంజుకొని రెండో గేమ్ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పాయ్ సమయోచితంగా ఆడింది. గేమ్ పాయింట్ సింధును ఒత్తిడిలోకి వరుసగా రెండు పాయింట్లు సాధించింది. సింధు కొరియా, డెన్మార్క్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. మిక్స్‌డ్ డబుల్స్‌ను మాత్రం భారత్ విజయంతో మొదలుపెట్టింది. సాత్విక్ సాయిరాజ్, అశ్విని పొన్నప్ప జోడీ 21-19, 21-19 తేడాతో కెనడా ద్వయం జోష్వా హర్ల్‌బర్ట్, జోసెఫిన్ వుపై గెలిచింది. ఇక పురుషుల సింగిల్స్‌లోనూ భారత ప్రస్థానం ఓటమితోనే మొదలైంది. డెంగీ జ్వరం నుంచి కోలుకొని రాకెట్ చేతపట్టిన హెచ్‌ఎస్ ప్రణయ్ 17-21, 18-21 తేడాతో రాస్మస్ గేమ్కీ (డెన్కార్క్) చేతిలో ఓడాడు.
సింధు ఓటమి
RELATED ARTICLES