బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ తొలి రౌండ్‌లోనే ఓటమి
గ్వాంగ్‌ఝౌ(చైనా): బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పివి సింధుకు మరో షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ గ్రూప్- గురువారం జరిగిన చైనా షట్లర్ చెన్ యూఫైతో జరిగిన మ్యాచ్‌లో సింధు 20-22, 21-16, 21-12 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచి ఊహించినంతగా రాణించలేదు. తొలి సెట్‌లో ప్రత్యర్థికి గట్టిపోటీ ఇచ్చిన సింధు ఈ సెట్‌లో 22-20 పాయింట్లతో విజయం సాధించింది. కానీ, ఆ తర్వాతి సెట్‌లలో ప్రత్యర్థి ఏ మాత్రం గట్టిగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో చెన్ మ్యాచ్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాతి రెండు సెట్లను చెన్ 21-16, 21-12 పాయింట్లతో దక్కించుకొని ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి సింధుకి వరుసగా రెండో ఓటమిని అందించింది. ఈ ఓటమితో సింధు దాదాపు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. సింధుకు తొలి ఓటమిని అందించిన అకానె యమగూచి (జపాన్) చైనాకు చెందిన షట్లర్ హే బింగ్‌జ్యోతో జరిగే మ్యాచ్‌లో ఓటమిపాలైతేనే.. సింధు టోర్నమెంట్‌లో కొనసాగే అవకాశం ఉంది.
సింధుకు షాక్
RELATED ARTICLES