క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్ : మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో గురువారం భారత్‌కు మిశ్రమ దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా.. మహిళల విభాగంలో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ పివి సింధు రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. అంతకుముందు రోజు మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో మహిళల విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. టైటిల్ ఫేవరేట్లుగా బరిలో దిగిన భారత స్టార్ మహిళా షట్లర్లు మరోసారి ఘోరమైన ఆటతో అందరిని నిరాశ పరిచారు. వీరిద్దరూ కనీసం క్వార్టర్స్ వరకు కూడా వెళ్లకపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ పివి సింధు 18 7 తేడాతో ప్రపంచ 10వ ర్యాంకర్ సుంగ్ జి హ్యూన్ (కొరియా) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగింది. తొలి గేమ్‌లో దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థికి గట్టి పోటీ నిచ్చింది. ఇద్దరూ పోటీపడి పాయింట్లు సాధిస్తూ పోవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆరంభంలో జోరును ప్రదర్శించిన సింధు తర్వాత మెత్తబడి వరుసగా పాయింట్లు కోల్పోతూ మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. దీంతో ఈ గేమ్‌ను కొరియా క్రీడాకారిణి 21 సొంతం చేసుకుంది. తర్వాతి గేమ్‌లోనూ సింధు తేలిపోయింది. ప్రత్యర్థి జోరు ముందు సింధు నిలవలేక భారీ తేడాతో ఈ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సమర్పించుకుంది. ఇంతకుముందు ఇదే కోరియా ప్లేయర్ చేతిలో సింధు ఆల్ ఇంగ్లాండ్, హాంగ్ కాంగ్ ఓపెన్ (2018) తొలి రౌండ్‌లోనే ఓడింది.
కిదాంబి అలవోకగా..
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత స్టార్, ఎనిమిదో సీడ్ కిదాంబి శ్రీకాంత్ 21 21 థాయ్‌లాండ్‌కు చెందిన కొసిట్ ఫెట్‌ప్రడబ్‌ను వరుస గేమ్‌లలో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన కిదాంబి థాయ్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యం కనబర్చాడు. వరుస స్వాష్ శాట్లతో కొసిట్‌పై విరుచుకుపడ్డాడు. ఆఖరికి తొలి గేమ్‌ను కిదాంబి 21 సునాయాసంగా గెలుచుకున్నాడు. తర్వాత జరిగిన రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కొంత మెర పోటీ ఎదురైనా శ్రీకాంత్ మాత్రం తెలివిగా ఆడుతూ ముందుకు సాగాడు. చివర్లో జో రును మరింతగా పెంచిన శ్రీకాంత్ 21 రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సైతం కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ను శ్రీకాంత్ 32 నిమిషాల్లోనే ముగించేశాడు. ఇక క్వార్టర్స్‌లో శ్రీకాంత్ నాలుగో సీడ్ చెన్ లాంగ్‌తో తలపడనున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్ రెండో మ్యాచ్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా రెడ్డిల భారత జంటపై 15 21 21 తన్ కిన్ మెంగ్ పి జింగ్ (మలేషియా) విజయం సాధించింది.
టాప్ సీడ్ మొమోటాకు చుక్కెదురు..
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ కెంటొ మొమోటాకు చుక్కెదురైంది. గురువారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ పోటీలో ఇండోనేషియాకు చెందిన జొనటన్ క్రీస్టే 22 21 జపాన్ స్టార్, టాప్ సీడ్ కెంటొ మోమోటాను ఓడించి సంచలనం సృష్టించాడు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ షీ యూకీ (చైనా) 21 21 ఆండర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు.
సింధుకు షాక్
RELATED ARTICLES