సాయిప్రణీత్ శుభారంభం.. ప్రణయ్ ఇంటికి
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు తొలి రోజే పెద్ద షాక్ తగిలింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగిన ఐదో సీడ్ భారత స్టార్ షట్లర్ పివి సింధు తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరో స్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్‌పై బి. సాయి ప్రణీత్ విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేశాడు. ఇక మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మెఘన, పూర్విషా జోడీ కూడా మొదటి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది.
తొలి రౌండ్‌లోనే..
భారత స్టార్, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ పివి సింధుకు తొలి రౌండ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. ఎన్నో ఆశలతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అడుగుపెట్టిన హైదరాబాదీ స్టార్ కొరియా ప్రత్యర్థి చేతిలో పోరాడి ఓడింది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సింధు 16 22 18 తేడాతో సుంగ్ జి యింగ్ (కొరియా) చేతొలో ఓటమిపాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన సింధు చివర్లో మాత్రం తడబడింది. దీంతో కొరియా క్రీడాకారిణి 21 సింధుపై గెలిచింది. తర్వాతి గేమ్‌లో పుంజుకున్న సింధు ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. వరుస స్మాష్‌లతో పాయింట్లు సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది. కానీ సుంగ్ జి యింగ్ కూడా గట్టిగా పోరాడుతూ సింధుపై ఎదురుదాడికి దిగింది. ఇద్దరూ ధాటిగా ఆడుతుండడంతో ఈ గేమ్ హోరాహోరీగా సాగింది. చివరికి ట్రై బ్రేక్క్ దారితీసింది. ఇక చివర్లో సింధు దూకుడు పెంచి 22 రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది. ఇద్దరూ చెరో గేమ్ గెలవడంతో ఆఖరిదైన మూడో గేమ్ ఇద్దరికి కీలకంగా మారింది. నిర్ణయాత్మకమైన ఈ గేమ్‌ల్నో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. నువ్వా.. నేనా.. అన్నట్టు మ్యాచ్ సాగింది. ఇద్దరూ చెరో పాయింట్ చేస్తూ ముందుకెళ్లడంతో ఈ మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ చివర్లో సింధు దూకుడు తగ్గడంతో ప్రత్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్లింది. చివరికి మూడు పాయింట్ల ఆధిక్యం సాధించిన సుంగ్ జి యింగ్ మ్యాచ్‌ను కైవసం చేసుకుని తర్వాతి రౌండ్లో దూసుకెళ్లింది. ఇక ఫలితాన్ని తేల్చే చివరి గేమ్‌లో ఓటమిపాలైన సింధు తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి వైదొలిగింది.
ప్రణయ్ ఔట్..
ఇక పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్‌కి తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో బి సాయి ప్రణీత్ 21 21 హెచ్‌ఎస్ ప్రణయ్‌ను వరుస గేమ్‌లలో ఓడించి ముందంజ వేశాడు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో తన కంటే సీనియర్ ప్రణయ్‌ను 2017 సింగపూర్ ఓపెన్ చాంపియన్ సాయి ప్రణీత్ ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్ ను ప్రణీత్ 52 నిమిషాల్లోనే ముగించాడు. గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్న ప్రణయ్ ఇంగ్లాండ్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఇక సాయి ప్రణీత్ ఈ విజయంతో ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. సాయి ప్రణీత్ తర్వాతి రౌండ్‌లో హాంగ్‌కాంగ్‌కు చెందిన నగ్ క లంగ్‌తో తలపడనున్నాడు. మరోవైపు మహిళల డబుల్స్‌లో మెఘన జక్కంపూడి, పూర్విషా ఎస్ రామ్ జోడీ 21 12 12 రష్యా జంట ఎకతెరినా బొలటొవా, అలీన డవెల్టొవా చేతిలో ఓటమిని చవిచూశారు. తొలి గేమ్‌లో జోరును కనబర్చిన భారత జోడీ.. తర్వాతి గేముల్లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా మొదటి రౌండ్‌లోనే ఈ భారత జంట ఇంటి ముఖం పట్టింది.
సింధుకు షాక్
RELATED ARTICLES