HomeNewsసింగరేణి సీఎండీ శ్రీధర్‌ ట్రాన్స్‌ఫర్‌.. ఫైనాన్స్‌ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు

సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ట్రాన్స్‌ఫర్‌.. ఫైనాన్స్‌ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు

సింగరేణి (Singareni) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ (Sridhar) బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్థానంలో సింగరేణి ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

సింగరేణి సీఎండీగా 2015, జనవరి 1న శ్రీధర్‌ బాధ్యతలు చేపట్టారు. దీంతో సంస్థ చరిత్రలో 9 ఏండ్లపాటు సుదీర్ఘంగా ఆ పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. అయితే ఒకే వ్యక్తిని ఎక్కువ కాలంపాటు ఎండీ కొనసాగించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆయనపై బదిలీ వేటు వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments