తెలంగాణ రాష్ర్ట గిరిజన సమాఖ్య, తెలంగాణ గిరిజన సంఘం నేతల ప్రకటన
ప్రజాపక్షం / హైదరాబాద్ హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన గిరిజన బాలిక కుటుంబానికి సత్వర న్యాయం కోసం ఈ నెల 16న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ రాష్ర్ట గిరిజన సమాఖ్య, తెలంగాణ గిరిజన సం ఘం నేతలు ప్రకటించారు. బాధిత గిరిజన బాలిక కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి కాలనీ చౌరస్తాలో జరిగిన రిలే నిరాహార దీక్షలో గిరిజన ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ర్ట గిరిజన సమాఖ్య రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్, నేత లు చందు నాయక్, దస్రు నాయక్ , తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మ నాయక్, ఆర్. శ్రీరామ్ నాయక్, నేతలు బాలు నాయక్ కిషన్ నాయక్, సేవల సేన అధ్యక్షుడు రాంబాబు నాయక్, నేత రేఖ్య నాయక్, సిపిఐ సైదాబాద్ డివిజన్ కార్యదర్శి షేక్ మహమూద్ తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. అఖి ల భారత ఆదివాసీ మహాసభ సీనియర్ నాయకులు, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షు డు ఆర్. శంకర్ నాయక్ శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ గిరిజనుల మాన,ప్రాణాలు కాపాడంలో రాష్ర్ట ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని, వారి మనుగడకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. చిన్నారి బాలిక అత్యాచారం, హత్యకు గురై ఐదు రోజులు కావస్తున్నా కెసిఆర్ ప్రభు త్వం స్పందించడం) లేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, తక్కువ ఆర్థిక వనరులు ఉన్న బాధిత బాలిక కుటుంబం న్యాయం కోసం ఎలా పోరాడాలో వారికి తెలియదని, మౌనంగా బాధపడుతున్నారని అయన తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితునికి కఠినంగా శిక్ష పడేలా చేసి, బాధిత బాలిక కుటుంబానికి ద్రవ్య పరిహారం రూ. 50 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లును అందజేయాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. అంజయ్య నాయక్ మాట్లాడుతూ రేపిస్టులకు వ్యతిరేకంగా రాష్ర్ట ప్రభుత్వం ద్వారా బలమైన చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గిరిజన మహిళలు, బాలికలపై తరుచుగా అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని, మహిళల రక్షణకు అనేక చట్టాలు తీసుకొచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాటిని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీ గిరిజన బాలిక అత్యాచారం, హత్య ఘటనపై ప్రభుత్వం పెద్దలు ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో స్పందించడం సిగ్గుచేటన్నారు. బాధిత బాలిక కుటుంబానికి సత్వరమే న్యాయం చేయాలని, లేకుంటే అన్ని గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు కలసి ఈ నెల 16న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని అంజయ్య నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్మ నాయక్, ఆర్. శ్రీరామ్ నాయక్‌లు మాట్లాడుతూ గిరిజన మహిళా హక్కుల పట్ల, రక్షణ పట్ల చిత్తశుద్ధి లేని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ విధానాలు గిరిజన బాలికలు,మహిళల ఉనికికి ప్రమాదకరంగా తయారయ్యాయని అన్నారు. లైంగిక హింస నేరస్థుల్ని శిక్షించేందుకు తెచ్చామన్న దిశ చట్టం పార్లమెంట్‌లో ఆమోద స్థానమే పొందలేదన్నారు. లేని చట్టాన్ని ఉన్నదన్నట్లు భ్రమింపచేసి దాని ప్రకారం నేరస్థులపై చర్యలు తీసుకొంటామని అనటం పాలకుల కపట వైఖరికి నిదర్శనమని వారు విమర్శించారు. సింగరేణి కాలనీ బాధిత బాలిక కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలనీ లేకుంటే అన్ని దళిత, గిరిజన, ప్రజాసంఘాలు కలసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ధర్మ నాయక్, ఆర్. శ్రీరామ్ నాయక్ లు కెసిఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
‘సింగరేణి’ ఘటనలో సత్వర న్యాయానికి 16న ప్రగతిభవన్ ముట్టడి
RELATED ARTICLES