కొనసాగించాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సిపిఐ విజ్ఞప్తి
సింగరేణి ప్రైవేటు పరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం సమర్పణ
ప్రజాపక్షం / హైదరాబాద్ : సింగరేణి కాలరీస్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 50 బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమవుతోందని, సింగరేణి ప్రైవేటు పరం కాకుండా రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 1943లో స్థాపించిన సింగరేణి కాలరీస్ కొత్తగూడెం, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, శ్రీరాంపూర్ బెల్లంపల్లి, భూపాలపల్లిలో విస్తరించి, లక్షకు పైబడి కార్మికలకు ఉపాధి కల్పించిందని వారు తెలిపారు. 1973లో కోల్‌మైన్స్ నేషన్‌ల్ యాక్టు ను అనుసరించి కోల్ ఇండియా పరిధిలోకి సింగరేణి వెళ్లిందన్నారు. అయితే ఇటీవల కరోనా ప్యాకేజీలో భాగంగా 50 బొగ్గు బ్లాకులను వేటు పరం చేస్తామని, వాటిని తీసుకునే కాంట్రాక్టర్‌ల కు రూ.1000కోట్లు రుణమిస్తామని కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి ప్రకటించారు. సింగరేణిలో ఇప్పటికే 28 అండర్‌గ్రౌండ్ మైన్స్, 19 ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో బొగ్గు వెలికి తీస్తున్నారని, గతేడాది కూడా రూ.1700 కోట్ల లాభం వచ్చిందని సిపిఐ నేతలు తెలిపారు. సింగరేణి పరిధిలో 11 కొత్తగా బొగ్గు బ్లాకులు గుర్తిచబడినవని, వాటిని కూడా వేలం వేసే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. చేతులు కాలిన తరువాత ఆకుల పట్టుకునే బదులు రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి 11 బ్లాకుల నుండి బొగ్గను వెలికి తీయాలని మంత్రికి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇదే అంశంపై సింగరేణి కాలరీస్ డైరెక్టర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రాకు కూడా సిపిఐ నేతలు వినతిపత్రం అందజేశారు.