సమ్మె పరిష్కారానికి సిఎం చొరవ చూపాలి
కెసిఆర్‌కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జిఒ 60 ప్రకారం వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించడం ద్వారా వారి సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఈ మేరకు ఆయన సిఎం కెసిఆర్‌కు సోమవారం లేఖ రాశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ఆయన లేఖతో జతచేశారు. సింగరేణిలో తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా గనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఈనెల 9వ తేదీ నుండి నిరవధిక సమ్మె ప్రారంభించారని, వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి సింగరేణి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి కాంట్రాక్టు కార్మికులకు జిఒ 60 ప్రకారం వేతనాలను పెంచేందుకు చొరవ చూపాలని సిఎంను ఆయన కోరారు. తద్వారా సమ్మె విరమింపచేసి యాజమాన్యం, కార్మికుల మధ్య సత్సంబంధాలు వుండే విధంగా చర్యలు తీసుకుని కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జిఒ 60 ప్రకారం వేతనాలు
RELATED ARTICLES