అమెరికా కవయిత్రికి నోబెల్
స్టాక్‌హోమ్: సాహిత్య రంగంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన కవయిత్రి లూయిస్ గ్లక్‌ను వరించింది. ఈ మేర కు స్వీడన్ అకాడమీ గురువారం ప్రకటించింది. 1943లో న్యూయార్క్‌లో జన్మించిన లూయిస్.. కనెక్టికట్‌లోని యాలే యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1968లో ఫస్ట్‌బార్న్ పేరుతో లూయిస్ తొలి కవిత రాశారు. కొద్ది కాలంలోనే అమెరికా సాహిత్యరంగంలో ప్రముఖ కవయిత్రిగా పేరుగాంచారు. తన కవితలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన ఆమె.. ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారం, నేషనల్ బుక్ అవార్డ్ వంటి ఎన్నో పురస్కారాలు పొందారు. లూయిస్ రాసిన ది వైల్ ఐరిష్ కవితకు 1993లోపులిట్జర్ అవార్డును అందుకున్నారు. నోబెల్ సాహిత్య పురస్కారాలపై గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పురస్కారాల విజేతలను ఎంపిక చేసే స్వీడిష్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 2018లో సాహిత్య రంగంలో నోబెల్ ప్రకటనను వాయిదా వేశారు. ఆ తర్వాత గతేడాది 2018, 2019 సంవత్సరాలకు గానూ రెండు పురస్కారాలను ఒకేసారి ప్రకటించారు. 2018 ఏడాదికి గానూ పొలాండ్‌కు చెందిన ప్రముఖ కవయిత్రి ఓల్గాకు పురస్కారం దక్కింది. 1991 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మంది నోబెల్ ఇవ్వగా.. వీరిలో మహిళలు 16 మంది ఉన్నారు.
సాహిత్య రంగంలో ఈ ఏడాది
RELATED ARTICLES