కార్మిక, ఉద్యోగ, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే పోరాటాలు ఉధృతం ఇందిరాపార్కు వద్ద జరిగిన సభలో నాయకుల హెచ్చరిక
ప్రజాపక్షం / హైదరాబాద్: కార్మిక, ఉద్యోగ, ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే దేశ కార్మిక వర్గం పోరాటాలను మరింత ఉధృ తం చేస్తుందని పలువురు ట్రేడ్ యూనియన్, ప్రజా సం ఘాల నాయకులు హెచ్చరించారు. ఈ సార్వత్రిక సమ్మె కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంపద సృష్టించే కార్మికులను అణచివేసే ధోరణిని అవలంబిస్తూ బడా పెట్టుబడి దా రులు, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఐక్య ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా బుధవారం ఇందిరాపార్క్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, జర్నలిస్టు సంఘా ల నాయకులు మాట్లాడారు. నర్సింహ్మ (ఎఐటియుసి), ఈశ్వర్‌రావు (సిఐటియు), అనురాధ (ఐఎఫ్‌టియు), బాబురావు (ఎఐయుటియుసి), పద్మ (ఐఎఫ్‌టియు), కె. విరహత్ అలీ (టియుడబ్ల్యుజె) అధ్యక్ష వర్గంగా జరిగిన ఈ సభలో కార్మిక సంఘాల నాయకులు విజయ కుమార్ (ఐఎన్‌టియుసి), విఎస్ బోస్ (ఎఐటియుసి), సాయిబాబ (సిఐటియు), కె.సూర్యం (ఐఎఫ్‌టియు), భరత్ (ఎఐయుటియుసి), ఎస్‌కె ముఖ్తార్ భాషా (ఐఎఫ్‌టియు), బోస్ (టిఎన్‌టియుసి), ఐజెయు అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రేంపావని (వర్కింగ్ ఉమెన్స్ ఫోరం, ఎఐటియుసి), ఆర్.వాణి (వర్కింగ్ ఉమెన్స్ ఫోరం, సిఐటియు), సలాఉద్దీన్ (ట్యాక్సీ డ్రైవర్స్), చావ రవి (యుటిఎఫ్), అరుణ (శ్రామిక మహిళ, ఐఎఫ్‌టియు), శివబాబు (గ్రామపంచాయతీ కార్మిక సంఘం), ఆదిల్ షరీఫ్ (ఐఐటియుసి) తదితరులు ప్రసంగించారు. విఎస్ బోస్ మాట్లాడుతూ సంపద సృష్టించే కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. దోపిడీ వర్గానికి కొమ్ముకాస్తున్న ప్రభుత్వానికి, సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి మధ్య పోరా టం జరుగుతోందన్నారు. ఇరాక్ నుండి భారత దేశానికి చమురు తీసుకురాకుండా ఆంక్షలు విధించిన అమెరికా కు మోడీ వంతపాడుతున్నారని విమర్శించారు. అమెరి కా పక్కనున్నారా..? ఇరాన్ పక్కనున్నారా అనేది మోడీ స్పష్టం చేయాలని బోస్ డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఎప్పుడూ ప్రజా పక్షాన ఉంటుందన్నారు. మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం కావాలా, పారిశ్రామిక వర్గం కావాలా తేల్చుకోవాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, ప్రైవేటు పరం చేసి దేశాన్ని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. దేశంలో కార్మిక ద్రోహి, దేశ ద్రోహ ప్రభు త్వం అధికారంలో ఉందని దుయ్యబట్టారు. భవిష్యత్తు లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నా రు. విజయకుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వా మ్య విలువలు కాలరాయబుడుతున్నాయని, మానవ హ క్కులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సి వల్ల ఎక్కువగా నష్టపోయేది అసంఘటిత రంగ కా ర్మికులేనన్నారు. సాయిబాబ మాట్లాడుతూ తమ హక్కు లు కాలరాయబడుతున్నాయని నేడు అన్ని వర్గాల కార్మికులు రోడ్డెక్కారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాలు అమలు కావడం లేదన్నా రు. మోడీ దేశ భక్తి ముసుగు తొలగిపోయిందని, కేం ద్రం విధానాలు మార్చుకోకపోతే గద్దెదించడానికి కార్మికవర్గం సిద్ధమవుతోందని హెచ్చరించారు. కె.సూర్యం మాట్లాడుతూ అచ్చేదిన్, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ఎక్కడుందని ప్రశ్నించారు.