HomeNewsBreaking Newsసాయిధరమ్‌ తేజ్‌ సరసన పూజాహెగ్డే?

సాయిధరమ్‌ తేజ్‌ సరసన పూజాహెగ్డే?


‘విరూపాక్ష’తో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌ తో కలిసి ’బ్రో’ చిత్రంలో నటిస్తున్నాడు. సంపత్‌ నంది ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనుందట. ఇప్పటికే దర్శక, నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు పూజా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. పూజా హెగ్డేకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ‘గుంటూరు కారం’ సినిమా నుంచి పూజాను హీరోయిన్‌గా తొలగించడంతో మేకర్స్‌ ఆమెతో ఓ స్పెషల్‌ సాంగ్‌ను చేయించాలని ప్లాన్‌ చేస్తున్నారట.
‘బ్రో’ సినిమా జులై 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments