ఒడిశా ప్రపంచ కవి సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి
భువనేశ్వర్ : సామాజిక భావాలను పంచుకోవడానికి చక్కని మాద్యమం గా కవిత్వం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప రస్పర భావాలను పంచుకోవడానికి చక్కని ఉపకరణగా వినియోగించుకోవడానికి విద్యార్థుల పా ఠ్యాంశాల్లో కవిత్వ అంశాన్ని పాఠ్యాంశంగా తప్ప క చేర్చాలని పాఠశాలల యాజమాన్యాలకకు ఆ యన పిలుపునిచ్చారు. ఒడిశాలో నిర్వహిస్తున్న 39వ ప్రపంచ కవిసమ్మేళ న కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్న వెంకయ్యనాయుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు. స్నేహం, శాంతి , ఆనందం, సోదరభావం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి కవిత్వం ప్రభావంతమైన వారధిగా ఉం దని ఉపరాష్ట్రపతి వెంకయ్య అభిప్రాపడ్డారు. కవిత్వాన్ని పాఠ్యాశంగా చే ర్చాలని అన్ని పాఠశాలలకు విజ్ఞప్తి చేస్తున్నా అని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు. అదేవిధంగా సాహిత్యాన్ని విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకన్నా మనకి కవులు, రచయితలు, నటులు, గాయకుల అవస రం ఎక్కువగా ఉందన్నారు. సమాజంలో శాంతి తత్వాన్ని పెంపొందించడానికి కవిత్వం దోహదపడుతుందన్నారు. అలాగే ప్రజల్లో సోదరభావం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా కవిత్వం దోహదపడుతందన్నారు. సా మాజిక భావాలను పంచుకోవడంలో కవిత్వం ప్రభావవంతమైన సాధనం గా ఉందన్నారు.
సామాజిక భావాలను పంచుకునే చక్కని సాధనం కవిత్వం
RELATED ARTICLES