ఎస్‌సి, ఎస్‌టి స్థానాల్లో కాంగ్రెస్ వ్యూహం
హైదరాబాద్: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వుడ్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఐదు రిజర్వు స్థానా లు ఉన్నాయి. వాటిలో మూడు ఎస్‌సి, రెండు ఎస్‌టి నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఎస్‌సిలకు వరంగల్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలు, ఎస్‌టిలకు మహబూబాబాద్, ఆదిలాబాద్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఈ సారి స్థానాల్లో ఉద్యమకారులకు టిక్కెట్లు ఇచ్చే అంశా న్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా వరంగల్ స్థానంలో ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అంగీకరిస్తే ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక పెద్దపల్లి నుంచి అద్దంకి దయాకర్ పేరు తెరపైకి వచ్చింది. ఎస్‌టి స్థానాలలో ఆదిలాబాద్ నుంచి సోయం బాబూరావు, మహబూబాబాద్ నుంచి బెల్లయ్యనాయక్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా వివిధ సామాజికవర్గాలకు సం బంధించి ఉద్యమాలు చేసిన వారే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తిం పుపొందిన అద్దంకి దయాకర్ తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బెల్ల య్యనాయక్ లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివాసీ సమస్యలపై పోరాడిన గుర్తింపు ఉంది. వీరు ముగ్గురు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వీరంతా తెలంగాణ ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు వారి సామాజిక వర్గాల్లో ఉద్యమకారులుగా గుర్తింపుతో పాటు తెలంగాణ ఉద్యమకారుల ట్యాగ్ కూడా వారికి కలిసొచ్చే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో అద్దంకి దయాకర్, సోయం బాపూరావులకు గత శాసనసభ ఎన్నికల్లో టిక్కెట్ లభించింది. ఇద్దరు కూడా స్వల్ప ఓట్లతో ఓడిపోయారు.
సామాజిక ఉద్యమకారులకు లోక్‌సభ టిక్కెట్లు?
RELATED ARTICLES